ఉద్యోగులకు ఆరు నెలలే పని

ప్రభుత్వ ఉద్యోగులు ఏడాదిలో ఆరు నెలల మాత్రమే పనిచేస్తున్నారు.ఎక్కడ? విదేశాల్లోనా? ఆరు నెలలు మాత్రమే పనిచేస్తే విదేశాలు ఎందుకంత అభివృద్ధి చెందుతాయి? ఈ వింత మన దేశంలోనిదే.

సాధారణంగానే మన దేశంలో ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు ఎక్కువ.

వారు సిన్సియర్‌గా పనిచేయడానికి ఇష్టపడరనే సంగతి అందరికీ తెలుసు.బోలెడు జీతాలు ఉండాలని, బోలెడు సెలవులు ఉండాలని కోరుకుంటారు.ఆ కోరిక ఉత్తరప్రదేశ్‌లో కొంతమేరకు ఫలించింది.

ఇక్కడ ప్రభుత్వ ఉద్యగులు ఆరు నెలలు మాత్రమే పనిచేస్తున్నారు.ఆరు నెలలు ఎంజాయ్‌ చేస్తున్నారు.

ఇది వారి తప్పు కాదు.పాలకుల తప్పు.

Advertisement

వారి రాజకీయ ప్రయోజనాలు ఉద్యగులకు ప్రయోజనకరంగా ఉన్నాయి.ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కొత్తగా మరో మూడు సెలవులు సృష్టించారు.

అవిః మాజీ ప్రధానులు చరణ్‌సింగ్‌, చంద్రశేఖర్‌, యూపీ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్‌ పుట్టిన రోజులు.ఈ మూడు సెలవులతో కలుపుకొని మొత్తం ప్రభుత్వ సెలవులు ముప్పయ్‌ ఎనిమిది రోజులయ్యాయి.

కొన్ని ప్రభుత్వ శాఖల్లో వారానికి ఐదు రోజులే పనిదినాలున్నాయి.కొన్ని ఐచ్ఛిక (ఆప్షనల్‌ హాలిడేస్‌) సెలవులున్నాయి.

ఎటూ తిరిగి దాదాపు ఆరు నెలలు సెలవులే ఉన్నాయని తేలింది.మధ్యప్రదేశ్‌, తమిళనాడువంటి రాష్ర్టాల్లో ప్రభుత్వ సెలవులు ఇరవైఅయిదే ఉన్నాయి.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఇప్పుడైనా జగన్ ను విమర్శిస్తారా ? మోది టూర్ పై కూటమి నేతల ఆశలు

యూపీలో ఇన్ని సెలవులు ఉండటంపై ఒళ్లుమండిన ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్‌ వేశాడు.ఈ సెలవు రాజకీయాలు ఏమిటని ప్రశ్నించాడు.

Advertisement

ప్రతి రాజకీయ నాయకుడి జయంతికి, వర్థంతికి సెలవు ఇవ్వడమేమిటని నిలదీశాడు.ప్రభుత్వ సెలవులు బాగా తక్కువగా ఉండేలా చూడాలని కోర్టుని కోరాడు.

ఇలాంటి తాటాకు చప్పుళ్లకు ప్రభుత్వాలు బెదురుతాయా? .

తాజా వార్తలు