ఆ సమయంలో నాన్న బాగా ఏడ్చారు.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన సితార!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) ప్రస్తుతం వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.

ఇటీవల గుంటూరు కారం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్ త్వరలోనే రాజమౌళి( Rajamouli ) సినిమాతో బిజీ కాబోతున్నారు.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.ఇక ఈ సినిమా త్వరలోనే షూటింగ్ పనులు ప్రారంభం కాబోతున్నాయని తెలుస్తుంది.

ఇదిలా ఉండగా మహేష్ బాబు కుమార్తె సితార( Sitara )గురించి కూడా అందరికీ ఎంతో సుపరిచితమే సితార సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ ఇంత చిన్న వయసులోనే ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

ఇక సితారకు నటన పట్ల ఉన్న ఆసక్తి చూస్తుంటే అతి త్వరలోనే ఈమె హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నారని తెలుస్తుంది.ఇక ఇంత చిన్న వయసులోనే ఎన్నో ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సితార తన తల్లిదండ్రుల గురించి అలాగే తన కెరియర్ గురించి కూడా ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

Advertisement

ఈ సందర్భంగా సితార తన ఫస్ట్ యాడ్ గురించి పలు విషయాలు తెలిపారు.

సితార ఫస్ట్ యాడ్ PMJ జ్యువెల్లర్స్( PMJ Jewellery ) కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ చేసిన సంగతి తెలిసిందే.ఈ యాడ్ కోసం ఈమె కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారు.అయితే ఈ కోటి రూపాయలు చారిటీకి ఇచ్చినట్లు సితార గతంలో తెలిపారు.

ఇక ఈ యాడ్ చూసిన తర్వాత నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారట.ఈ యాడ్ చూసిన తర్వాత ఆల్మోస్ట్ ఏడ్చేసారని సితార వెల్లడించారు.

ఇక తన తల్లి గురించి మాట్లాడుతూ అమ్మ చాలా స్ట్రిక్ట్ .ప్రతి విషయంలోనూ ఎంతో క్రమశిక్షణగా ఉండాలని భావిస్తుంది.కానీ నాన్న మాత్రం చాలా గారాభం చేస్తారు అంటూ ఈ సందర్భంగా తన తల్లిదండ్రుల గురించి సితార చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ట్యాక్స్ ట్యాక్స్ పేయర్ల కు ప్రభుత్వం ప్రత్యేక హక్కులు కల్పించాల్సిందే.. కొరటాల శివ డిమాండ్..?
Advertisement

తాజా వార్తలు