Singer Papon: హాస్పిటల్ పాలైన ప్రముఖ సింగర్.. కొడుకు చేసిన పనికి కంటతడి పెడుతూ?

ప్రముఖ సింగర్ అంగారాగ్ మహంత అలియాస్ పాపోన్( Singer Papon ) తీవ్ర అస్వస్థకు గురయ్యారు.దాంతో ఆయనను హాస్పిటల్ లో చేర్పించారు.

కాగా ప్రస్తుతం పాపోన్ ముంబై లోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ అనే హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

కాగా అందుకు సంబంధించిన ఫోటోలను పాపోన్ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ ఒక ఎమోషనల్ పోస్ట్ ని కూడా రాసుకొచ్చాడు.

ఆ ఫొటోలో తన కుమారుడు కూడా పక్కనే ఉన్న ఫోటోను షేర్ చేస్తూ భావోద్వేగానికి గురయ్యాడు.కాగా పాపోన్ ఆ పోస్ట్ లో ఈ విధంగా రాసుకొచ్చారు.మనమందరం ఈ చిన్న చిన్న యుద్ధాలను ఒంటరిగా పోరాడుతున్నాము.

Advertisement

ఇలాంటి సంఘటనలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం నాకు వ్యక్తిగతంగా ఇష్టం లేదు.కానీ నిన్న రాత్రి జరిగింది మాత్రం వేరు.

ఎందుకంటే మొదటిసారి 13 ఏళ్ల నా కుమారుడు ( Singer Papon Son ) ఆసుపత్రిలో రాత్రి నాకు కాపలాగా ఉన్నాడు.ఈ భావోద్వేగ క్షణం గురించి నా స్నేహితులు, శ్రేయోభిలాషులతో పంచుకోవాలనుకుంటున్నా.

నా తల్లితండ్రుల కోసం నేను ఇలాగే చేసినట్లు నాకు గుర్తుంది.

ఇప్పుడు వారి మనవడు పుహోర్ తన బాధ్యతను తీసుకోవడం చూసేందుకు వారు చుట్టూ ఉన్నారని అనుకుంటున్నాను.నా కోసం ప్రార్థించిన మీ అందరికీ ధన్యవాదాలు,నేను ఇప్పుడు చాలా బాగున్నాను అంటూ ఎమోషనల్ నోట్( Emotional Note ) రాసుకొచ్చారు పాపోన్.ఈ పోస్ట్ పై నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నారు.

ఆ ఒక్క సినిమా నా జీవితాన్నే మార్చేసింది... రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
రవితేజ కి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తే కథ కూడా వినకుండా సినిమా చేసేస్తాడా..?

ఆయన తొందరగా కోలుకోవాలి అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.కాగా పాపోన్ హిందీ తమిళం మరాఠీ భాషల్లో ఎన్నో పాటలను పాడి ప్రేక్షకులను అలరించారు.

Advertisement

అంతేకాకుండా సింగర్ గా కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకున్నారు.అలాగే సినిమాలతో పాటు పలు టీవీ షోలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు.

తాజా వార్తలు