జబర్దస్త్‌ లో ఇకపై మనో సందడి ఉండనట్లేనా?

వారం వారం ఈటీవీలో ప్రసారం అవుతున్న జబర్దస్త్ తన ప్రభావాన్ని కోల్పోతుంది అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎందరో జబర్దస్త్ కామెడీయన్స్ ఇప్పటికే కార్యక్రమాన్ని వదిలేసి వెళ్లిపోయారు.

వారు వెళ్లిపోవడంతో రేటింగ్ చాలా తగ్గింది.ముఖ్యంగా సుడిగాలి సుదీర్ వెళ్లిపోయిన కారణంగా జబర్దస్త్ రేటింగ్ చాలా దిగజారిపోయింది.

మరోవైపు హైపర్ ఆది జబర్దస్త్ కి దూరంగా ఉంటున్నాడు.ఆయన కేవలం శ్రీదేవి డ్రామా కంపెనీలో మాత్రమే సందడి చేస్తున్నాడు.

ఇక సుదీర్ఘ కాలంగా జడ్జ్ సీట్లో కూర్చున్న రోజా ఇప్పుడు మంత్రి పదవి రావడంతో జబర్దస్త్ కి గుడ్ బాయ్ చెప్పేసింది.ఇక నాగబాబు తర్వాత ఫుల్ టైం జడ్జి పాత్రలో మంచి సక్సెస్ అయిన ప్రముఖ గాయకుడు మనో ఇప్పుడు జబర్దస్త్ కి దూరమైనట్లుగా తెలుస్తోంది.

Advertisement

గత కొన్నాళ్లుగా ఇంద్రజ మరియు ఖుష్బూ లేదంటే ప్రగతి ఇలా గెస్ట్ జడ్జిలు కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు.ఇలా వారం వారం మారుతూ ఉంటే ప్రేక్షకులకు ఆసక్తి కలగడం లేదు అంటూ కొందరు అభిప్రాయం చేస్తున్నారు.

పారితోషికం మరియు ఇతర విషయాల కారణంగా సింగర్ మనో జబర్దస్త్ కార్యక్రమానికి గుడ్ బై చెప్పేసే విషయమై ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.ఆయన ప్రతివారం షూటింగ్ కోసం చెన్నై నుండి రావాల్సి వస్తుంది.

అందుకోసం చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది, అంతేకాకుండా ఆయన వచ్చిన సమయంలో బస్స చేసేందుకు హైదరాబాదులో కాస్త ఎక్కువగానే ఖర్చు అవుతుంది.కనుక ఆయనకు వచ్చే పారితోషకం మరియు ఖర్చు రెండు బేరిజ్ వేసుకుంటే కాస్త ఆయనకు నష్టమే మిగులుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

అందుకే మల్లెమాల వారికి గుడ్ బై చెప్పేసి చెన్నైకి పరిమితం అవ్వాలని సింగర్ మనో భావిస్తున్నాడట, అందులో భాగంగానే వచ్చేవారం మరియు పై వచ్చే వారం ఎపిసోడ్ లో కూడా ఆయన కనిపించే పోవడం లేదు.ముందు ముందు కూడా ఆయన కనిపిస్తాడా లేదా అనేది క్లారిటీ లేదు.జబర్దస్త్ నిర్వాహకులు కాస్ట్ కట్టింగ్ పేరుతో పెద్ద ఎత్తున తమ వజ్రాలని వదిలేసుకుంటున్నారు అంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

నిత్యం ఈ పొడిని తీసుకుంటే కళ్ళ‌జోడుకు మీరు శాశ్వతంగా గుడ్ బై చెప్పొచ్చు!
కూతురి పెళ్లి వీడియో షేర్ చేసిన అర్జున్ సర్జా... మాటలు రావడం లేదంటూ పోస్ట్?

అయినా కూడా వారు పట్టించుకోకుండా తాము చేయాలనుకున్నదే చేస్తూ ముందుకు సాగుతున్నారు.ఇలాగే జరిగితే జబర్దస్త్ ముందు ముందు రోజుల్లో ఉంటుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు