ప్రముఖ సింగర్ అరెస్ట్.. ఎందుకో తెలుసా?

సినీ పరిశ్రమలోని వ్యక్తులు కూడా అప్పుడప్పుడు తప్పులు చేస్తూ పోలీసులకు చిక్కుతుంటారు.తాజాగా ఇలాంటి ఘటన తమిళ ఇండస్ట్రీలో చోటు చేసుకుంది.

తమిళనాడుకు చెందిన ప్రముఖ సింగర్ ధరణి అతడి భార్యను వేధింపులకు గురిచేస్తున్నారనే ఫిర్యాదుపై పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.తమిళంలో ప్రముఖ సింగర్‌గా పేరొందిన పజని కుమారుడైన ధరణి కూడా సింగర్‌గా కెరీర్ సాగిస్తున్నాడు.

తన స్నేహితురాలైన విజయభానును ప్రేమించి పెళ్లాడాడు.ఆ సమయంలో విజయ భాను కుటుంబం నుండి భారీ మొత్తంలో కట్నకానుకలు స్వీకరించాడు ధరణి.

పెళ్లయిన తరువాత ఆమెను వేధించడం మొదలుపెట్టాడు.ఈ క్రమంలోనే నిత్యా అనే మరో మహిళతో అక్రమం సంబంధం పెట్టుకున్న ధరణి విజయభానును మానసికంగా, శారీరకంగా వేధించడం, అధిక కట్నం కోసం వేధించడం చేస్తున్నాడు.

Advertisement

దీంతో విసుగుచెందిన ఆమె పోలీసులను ఆశ్రయించింది.

భార్యను వేధింపులకు గురిచేస్తున్నట్లు కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.కాగా అతడికి సాయం చేసినట్లుగా ధరణి కుటుంబసభ్యులను కూడా అరెస్ట్ చేశారు.ఈ కేసుకు సంబంధించిన నిత్యాను కూడా విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

అక్రమ సంబంధం మోజులో కటకటాలపాలయ్యాడు ఈ ఘనుడు.

జీవితం మహా చెడ్డది భయ్యా.. భార్య వల్ల చెత్త ఏరుకునే స్థాయికి ఇంజనీర్‌..?
Advertisement

తాజా వార్తలు