శ‌రీరం తెల్ల‌గా ఉన్నా చేతులు న‌ల్ల‌గా ఉన్నాయా? అయితే ఇలా చేయండి!

సాధార‌ణంగా కొంత మందికి శ‌రీరం మొత్తం తెల్ల‌గానే ఉన్నా చేతులు మాత్రం న‌ల్ల‌గా ఉంటాయి.

ఎండ‌ల ప్ర‌భావం, డెడ్ స్కిన్ సెల్స్ పేరుకు పోవ‌డం, కెమిక‌ల్స్ ఎక్కువ‌గా ఉండే లోష‌న్లు వాడ‌టం వంటి ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల చేతులు న‌ల్ల‌గా మారి కాస్త అస‌హ్యంగా క‌నిపిస్తుంటాయి.

దాంతో చేతుల న‌లుపును వ‌దిలించుకోవ‌డం కోసం నానా ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.కొంద‌రైతే ట్రీట్‌మెంట్స్ కూడా చేయించుకుంటారు.

అయినా ఫ‌లితం లేకుంటే ఏం చేయాలో తెలీక స‌త‌మ‌తం అయిపోతుంటారు.అయితే ఇప్పుడు చెప్ప‌బోయే హోమ్ రెమెడీని ప్ర‌య‌త్నిస్తే చాలా అంటే చాలా సుల‌భంగా చేతుల‌ను న‌లుపును వ‌దిలించుకోవ‌చ్చు.

మ‌రి లేటెందుకు ఆ హోమ్ రెమెడీ ఏంటో.? దాన్ని ఎలా సిద్ధం చేసుకోవాలో.? తెలుసుకుందాం ప‌దండీ.ముందుగా రెండు క‌మ‌లా పండ్ల‌ను తీసుకుని తొక్క‌ల‌ను వేరు చేసుకోవాలి.

Advertisement

అలాగే ఒక నిమ్మ పండును తీసుకుని చిన్న చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి.ఇప్పుడు స్ట‌వ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో క‌మ‌లా పండు తొక్క‌లు, నిమ్మ పండు ముక్క‌లు, ఒక గ్లాస్ వాట‌ర్ పోసి ప‌ది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు ఉడికించాలి.

నీరంతా పోయాక స్ట‌వ్ ఆఫ్ చేసి.వీటిని చ‌ల్లార‌బెట్టుకోవాలి.

ఆ త‌ర్వాత మిక్సీ జార్‌లో ఉడికించి పెట్టుకున్న క‌మ‌లా పండు తొక్క‌లు, నిమ్మ పండు ముక్క‌లు వేసి మెత్త‌గా పేస్ట్ చేసుకోవాలి.

ఈ పేస్ట్‌లో వ‌న్ టేబుల్ స్పూన్ ఎర్ర కందిప‌ప్పు పౌడ‌ర్‌, వ‌న్ టేబుల్ స్పూన్ రోజ్ వాట‌ర్‌, రెండు విట‌మిన్ ఇ క్యాప్సుల్ ఆయిల్ వేసి మిక్స్ చేసుకోవాలి.ఆ మిశ్ర‌మాన్ని చేతుల‌కు అప్లై చేసి ప‌ది నిమిషాల పాటు ఆర‌బెట్టుకోవాలి.ఆపై అర నిమ్మ చ‌క్క‌ను తీసుకుని చేతుల‌పై రుద్దుకుంటూ నార్మ‌ల్ వాట‌ర్‌తో క్లీన్ చేసుకోవాలి.

రెండు స్పూన్ల బియ్యంతో హెయిర్ ఫాల్ దూరం.. ఎలా వాడాలంటే?
నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?

మూడు రోజుల‌కు ఒక సారి ఇలా చేస్తే న‌లుపు పోయి చేతులు తెల్ల‌గా, అందంగా మార‌తాయి.

Advertisement

తాజా వార్తలు