కంచి కామాక్షి ఆలయంలో దాగిఉన్న కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఇవే?

మనదేశంలో అష్టాదశ శక్తిపీఠాలలో కొలువై ఉన్న ఆలయాలలో కంచి కామాక్షి ఆలయం ఒకటి.

ఈ ఆలయంలో కామాక్షి అమ్మవారు కొలువై ఉండి భక్తుల చేత విశేష పూజలను అందుకుంటున్నారు.

అష్టాదశ పీఠాలలో ఒకటైన ఈ అమ్మవారి ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశిష్టత ఏమిటి? అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.తమిళనాడు రాష్ట్రంలో కాంచీపురం జిల్లా శివకంచిలో కామాక్షి దేవి అమ్మవారు కొలువై ఉన్నారు.

ఈ ఆలయంలో అమ్మవారు మరెక్కడా లేని విధంగా యోగముద్రలో పద్మాసనంపై ఆసీనురాలై భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు.శివ కంచిలో ఎన్నో వేల ఆలయాలు ఉన్నప్పటికీ ఎక్కడ కూడా అమ్మవారి ఆలయం అనేది లేదు.

కేవలం కామాక్షి అమ్మవారి ఆలయం తప్ప మనకు శివకంచిలో మరే ఇతర అమ్మవారి ఆలయాలు కనిపించవు.పురాణాల ప్రకారం అమ్మవారు వివిధ శక్తి రూపాల్లోని శక్తి నంతటిని గ్రహించి మన్మధునిలో ఆవహింప చేసింది అని పురాణాలు చెబుతున్నాయి.

Advertisement

సాధారణంగా ప్రతి ఆలయంలో అమ్మవారి విగ్రహం స్వామివారి విగ్రహం పక్కనే ఉండి భక్తులకు దర్శనమిస్తుంటారు.కాని ఈ ఆలయంలో అమ్మవారు ఒక్కరే భక్తులకు దర్శనం ఇవ్వగా, అమ్మవారి ఆలయానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఏకామ్రేశ్వరస్వామి ఆలయం ఉండటం విశేషం.అదేవిధంగా ఏ ఆలయంలోనైనా ఆ స్వామి వారికి సంబంధించిన బీజాక్షరాలను ఒక యంత్రం పై రాసి ఆ యంత్రాన్ని పీఠం కింద ఉంచి పైన స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేస్తారు.

కానీ ఈ ఆలయంలో మాత్రం అమ్మ వారికి చెందిన బీజాక్షరాలతో రచించిన యంత్రం మాత్రం అమ్మవారి విగ్రహానికి ఎదురుగా ఉండటమే కాకుండా, యంత్రానికి పూజలను నిర్వహిస్తుంటారు.ఈ విధంగా శివ కంచిలో వెలసిన కామాక్షి అమ్మవారికి ఈ సంవత్సరం మార్చి నెలలో పెద్దఎత్తున రథోత్సవం నిర్వహిస్తారు.

ఈ రథోత్సవంలో భాగంగా చుట్టుపక్కల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తుంటారు.అదేవిధంగా శివ కంచిలో వెలసిన అమ్మవారు ఆలయం పర్యాటక క్షేత్రంగా ఎంతో ప్రసిద్ధి చెందినది.

సూర్య కంగువ సినిమా మీద ఫోకస్ చేసిన అమీర్ ఖాన్...కారణం ఏంటంటే..?

Advertisement

తాజా వార్తలు