శీతాకాలంలో వేడి నీటితో స్నానం చేస్తే ఇక అంతే..

శీతాకాలం లో చాలామంది ప్రజలు వేడి నీటితో స్నానం చేస్తూ ఉంటారు.కొంతమంది అయితే చలికాలంలో వేడి నీటితో మొహం కూడా కడుక్కుంటూ ఉంటారు.

చాలా మంది ప్రజలు శీతాకాలంలో చల్లని నీటినీ అసలు ఉపయోగించరు.చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే చలికాలంలో వేడి నీటి స్నానం అస్సలు మంచిది కాదు.మీరు చదివినది నిజమే.

చలికాలంలో వేడి నీటితో స్నానం చేయడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి.అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వేడి నీటితో క్రమం తప్పకుండా స్నానం చేయడం అస్సలు మంచిది కాదు.ఎందుకంటే ఇలా స్నానం చేసేటప్పుడు పురుషుల్లో వీర్యకణాలు వేడెక్కడంతో పాటు నాలుగు నుంచి ఐదు వారాల్లో స్పెర్మ్ కౌంట్ కూడా బాగా తగ్గిపోతుంది.

ఇది పురుషుల్లో నపుంసకత్వం ప్రమాదాన్ని పెంచుతుంది.ఎక్కువ వేడిగా ఉండే నీళ్లతో స్నానం చేయడం వల్ల చర్మం పై ఎర్రటి దద్దుర్లు కూడా వస్తాయి.

అంతేకాకుండా వేడి నీటితో స్నానం చేయడం వల్ల చర్మంలోని తేమ తొలగిపోయి చర్మం పొడి వారి గరుకుగా మారుతుంది.వేడి ఎక్కువగా ఉన్న నీటితో స్నానం చేయడం వల్ల కన్నులు కూడా దెబ్బతింటాయి.అంతేకాకుండా అది కంటి గాయాల నుంచి థర్మల్ నెక్రోసిస్ వంటి సమస్యలకు దారితీస్తుంది.

సమస్య మరి ఎక్కువైతే అందత్వం వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి.శీతాకాలంలో చాలామంది హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతూ ఉంటారు.అలాగే ప్రస్తుత రోజులలో వాతావరణ కాలుష్యం, పోషకాహర లోపం, చుండ్రు వంటి ఎన్నో కారణాల వల్ల తల వెంట్రుకలు దెబ్బతింటాయి.

ఎక్కువగా వేడిగా ఉండే నీటితో తలస్నానం చేయడం వల్ల తలపై చర్మం దెబ్బతింటుంది.

రూ.10 లక్షల విరాళం ప్రకటించినా రష్మికపై ట్రోల్స్.. అలా చేయడమే తప్పైందా?

తాజా వార్తలు