మరణాన్ని ముందే ఉహించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి.. నెట్టింట్లో వీడియో వైరల్?

టాలీవుడ్ ప్రముఖ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఇటీవల మరణించిన విషయం తెలిసిందే.ఆయన మరణవార్తని ఇప్పటికీ అభిమానులు ఇండస్ట్రీలో పలువురు ప్రముఖులు జీర్ణించుకోలేకపోతున్నారు.

ఆయన ఇంకా పాటల రూపంలో బతికే ఉన్నారు అన్న నిజంతో ఉన్నారు.నాని హీరోగా నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమాకు సిరివెన్నెల రెండు పాటలు రాశారు.

ఈ సినిమాకు రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.ఈ సినిమా డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమాలో ఒక పాటకు సిరివెన్నెల పేరు పెట్టి విడుదల చేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.ఇక ఆ పాట రాసినప్పుడు సిరివెన్నెల ఏమన్నారు అన్న విషయాన్ని దర్శకుడు రాహుల్ పంచుకున్నారు.

Advertisement

నవంబర్ 3వ తేదీ రాత్రి సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాహుల్ కి ఫోన్ చేసి ఆరోగ్యం సహకరించక ఈ పాటను పూర్తి చేయలేకపోతున్నా, ఇంకా ఎవరితో అయినా రాయిద్దాం అని అనడంతో అప్పుడు రాహుల్ పర్వాలేదు సార్ అని చెప్పారట.

మరుసటి రోజు ఉదయాన్నే సిరివెన్నెలగారు రాహుల్ కి కాల్ చేసి నిద్రలేపి, పల్లవి అయిపోయింది చెబుతాను రాసుకో అని అన్నారట.సడన్ గా చెప్పేసరికి రాహుల్ ఎక్కడ రాయాలో అర్థం కాక పక్కనే ఉన్న మహాభారతం పుస్తకం పై రాసారట.అందులో అద్భుతమైన ఆరు లైన్లు ఇవ్వగా అందులో మొదటి లైన్ సిరివెన్నెల పేరు రాశారట.

ఎందుకు సార్ ఈ పాటకు మీ సంతకం ఇచ్చారు అని రాహుల్, సిరివెన్నెల గారిని అడగగా.బహుశా ఇదే నా ఆఖరి పాట అవ్వచ్చు అని గట్టిగా నవ్వారు అంటూ రాహుల్ చెప్పుకొచ్చారు.

ఇక ఇదే పాట రికార్డింగ్ మొదలు పెట్టిన రోజునే సిరివెన్నెల అంత్యక్రియలు జరిగాయి.

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు