నవంబర్ లో శ్యామ్ సింగ రాయ్ సినిమా స్టార్ట్ చేయబోతున్న నాని

నేచురల్ స్టార్ నాని తాజాగా వి సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.అయితే ఈ సినిమా కూడా అతనికి మరో డిజాస్టర్ ని అందించింది.

సినిమా మీద భారీ హైప్ క్రియేట్ చేసిన, ఒక రొటీన్ రివేంజ్ డ్రామాగా మిగిలిపోయింది.పాత కథకి కొత్త కలరింగ్ ఇచ్చే ప్రయత్నం ఇంద్రగంటి ఈ సినిమాతోనే చేసాడనే విమర్శలు వచ్చాయి.

రిలీజ్ తర్వాత నాని ఈ సినిమా గురించి ఎక్కువగా మాట్లాడలేదు.వరుసగా మూడు ఫ్లాప్ లతో నేచురల్ స్టార్ నాని రేసులో కొంత వెనుకబడ్డాడు.

అయితే ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో చేస్తున్న టక్ జగదీష్ సినిమా మీద నాని ఎక్కువ హోప్స్ పెట్టుకున్నాడు.వరుసగా రెండు క్లాసిక్ హిట్స్ తో జోరు మీద ఉన్న శివ ఈ సినిమాతో తనకి సూపర్ హిట్ ఇవ్వడంతో హ్యాట్రిక్ కొడతాడనే అభిప్రాయం టాలీవుడ్ లో కూడా ఉంది.

Advertisement

ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో పీరియాడికల్ ఫిక్షన్ కథతో శ్యామ్ సింగరాయ్ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ నానికి జోడీగా నటిస్తున్నారు అనే టాక్ ఉంది.

అందులో సాయి పల్లవి ఒక హీరోయిన్ గా కనిపించబోతుందని సమాచారం.ఇదిలా ఉంటే ఈ సినిమాని త్వరలో సెట్స్ పైకి తీసుకొని వెళ్ళబోతున్నట్లు తెలుస్తుంది.

నవంబర్ లో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది.అప్పటికి టక్ జగదీశ్ సినిమా షూటింగ్ కూడా పూర్తయిపోయింది కాబట్టి వెంటనే గ్యాప్ లేకుండా శ్యామ్ సింగరాయ్ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళే పనిలో ఉన్నారు.

నాని కెరియర్ లో మొదటి సారిగా పూర్తి భిన్నమైన పాత్రలో శ్యామ్ సింగరాయ్ సినిమాలో నటించబోతున్నాడు.మరి ఈ సినిమా అతనికి ఎంత వరకు సూపర్ హిట్ ఇస్తుంది అనేది వేచి చూడాలి.

హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?
Advertisement

తాజా వార్తలు