ఇటీవల కాలంలో అడవుల నరికి వేత కారణంగా వన్యప్రాణులు జనావాసాల్లోకి వస్తున్నాయి.ఈ క్రమంలోనే మనుషులకు ఊహించని విధంగా అవి షాక్ లేస్తున్నాయి.
ఈ క్రమంలోనే ఉదయ్‌పూర్‌లోని రద్దీగా ఉండే శిల్ప్‌గ్రామ్ మెయిన్ రోడ్డుపై ( Shilpgram Main Road )మరో షాకింగ్ ఘటన జరిగింది.ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో రోడ్డు దాటుతున్న ఓ చిరుతపులి, పాల వ్యాపారి బైక్‌ను బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఇద్దరూ గాయపడ్డారు.రోడ్డుపై పాలు ఏరులై పారాయి.
ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
సాయంత్రం 7:53 నిమిషాలకు ఓ చిరుతపులి ప్రహరీ గోడ దూకి రోడ్డుపైకి వచ్చింది.అదే సమయంలో పాల వ్యాపారి పాల డబ్బాలతో బైక్‌పై వేగంగా వెళ్తున్నాడు.క్షణాల్లోనే ఇద్దరూ ఒకరినొకరు ఢీకొట్టారు.బైక్, చిరుతపులి రెండూ కిందపడిపోయాయి.ఒక్కసారిగా ఏం జరిగిందో తెలియక చిరుతపులి కాసేపు కదలకుండా ఉండిపోయింది.
ఆ తర్వాత గాయాలపాలైనప్పటికీ తేరుకుని అక్కడి నుంచి నెమ్మదిగా వెళ్లిపోయింది.

ఇక పాల వ్యాపారి రోడ్డుపై పడిపోయి దిక్కుతోచని స్థితిలో ఉండిపోయాడు.పాలు మాత్రం రోడ్డుపై చిందరవందరగా పడిపోయాయి.పెద్ద శబ్దం రావడంతో చుట్టుపక్కల వాళ్లు ఏం జరిగిందో అని బయటకు పరుగులు తీశారు.
దగ్గర్లోని ఓ ఇంటి నుంచి ఇద్దరు వ్యక్తులు సాయం చేయడానికి వచ్చారు.కానీ చిరుతపులిని చూడగానే భయంతో వెనక్కి పరుగులు తీశారు.చిరుతపులి ( Leopard )వెళ్లిపోయిందని నిర్ధారించుకున్నాక మళ్లీ భయపడుతూ బయటకు వచ్చారు.అటుగా వెళ్తున్న ఓ కారు కూడా ఆగింది.
అందరూ కలిసి పాల వ్యాపారిని లేవనెత్తి సురక్షితంగా పక్కకు తీసుకెళ్లారు.

ఉదయ్‌పూర్‌లో చిరుతపులులు కనిపించడం ఇదేం మొదటిసారి కాదు.గత నెలలో చిరుతపులి దాడిలో పది మంది మరణించడం కలకలం రేపింది.అంతేకాదు, ఆల్వార్, దౌసా, జైపూర్, సికార్ ప్రాంతాల్లో కూడా చిరుతల సంచారం ఎక్కువైందని వార్తలు వస్తున్నాయి.
డిసెంబర్‌లో జరిగిన మరో షాకింగ్ ఘటనలో.ఓ చిరుతపులి కళ్లెదుటే తల్లిముందు ఓ చిన్నారిపై దాడి చేసింది.
ఆ చిన్నారి మెడ, ముఖంపై గోళ్లతో గట్టిగా గీకింది.తల్లి గట్టిగా కేకలు వేయడంతో చిరుతపులి అక్కడి నుంచి పారిపోయింది.
రాజస్థాన్‌లో చిరుతపులులు తరచూ కనిపించడం ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తోంది.ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.
భద్రతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.







