వృద్ధ వరుడు ఊర మాస్ డ్యాన్స్.. చివరకు వధువు ఒడిలో వాలిపోయాడు.. షాకింగ్ క్లైమాక్స్!

ఇంటర్నెట్ పుణ్యమా అని ఇప్పుడు ఏది ఎప్పుడు వైరల్ అవుతుందో చెప్పలేం.కొన్ని వీడియోలు చూస్తే కడుపుబ్బ నవ్వుకుంటాం, కొన్ని చూస్తే కంటతడి పెట్టుకుంటాం.

 Shocking Climax Where The Old Groom Finally Falls On The Bride's Lap At The Mass-TeluguStop.com

కానీ ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వీడియో మాత్రం రెండిటికీ అతీతం.ఇది ఒక పెళ్లి వీడియో.

అయితే ఇక్కడ వధువు కాదు, ఏకంగా పెళ్లి కొడుకే హీరో అయిపోయాడు.తన ఊర మాస్ డ్యాన్స్ స్టెప్పులతో ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాడు.

సాధారణంగా పెళ్లిళ్లలో అమ్మాయిలు డ్యాన్స్ చేస్తూ సందడి చేస్తుంటారు.కానీ ఈ పెళ్లి కొడుకు మాత్రం వాళ్లందరినీ మించిపోయాడు.

అంతే కాదు, పెళ్లికి వచ్చిన వాళ్లనే కాదు, వీడియో చూసిన నెటిజన్లని కూడా తన ఎనర్జీతో కట్టిపడేస్తున్నాడు.

ఇంతకీ ఏం జరిగిందంటే, పెళ్లి ఊరేగింపు జరుగుతుండగా రోడ్డుపై ఒక్కసారిగా డ్యాన్స్ మొదలుపెట్టాడు ఈ పెళ్లి కొడుకు.

కరీనా కపూర్ నటించిన ‘మైన్ ప్రేమ్ కీ దీవానీ హూ’ ( Main Prem Ki Deewani Hoo )సినిమాలోని పాట బ్యాక్ గ్రౌండ్ లో మోగుతుండగా… ఇక అంతే, దుమ్ము దులిపేసాడు.చుట్టూ జనం ఉన్నారన్న సిగ్గు లేదు, బిడియం లేదు.

పిచ్చెక్కినట్టు డాన్స్ చేస్తూ అందరి దృష్టినీ తన వైపు తిప్పుకున్నాడు.అక్కడ ఉన్నవాళ్లంతా నోరెళ్లబెట్టి అతని డాన్స్ చూస్తూ ఉండిపోయారు.

జోక్ ఏంటంటే ఈ వరుడు వృద్ధాప్యంలో ఉన్నట్లుగా కనిపిస్తున్నాడు.ముఖం మీద ముడతలు వచ్చేసాయి.అలా కనిపించిన కుర్రాళ్ళు లాగా డాన్స్ ఇరగదీసాడు.అంతేకాదు, పెళ్లి రిసెప్షన్‌లో కూడా తన డ్యాన్స్ తో అదరగొట్టాడు.వధువు ( bride )పక్కనే స్టేజ్ మీద కూడా స్టెప్పులేశాడు.అలసిపోకుండా గంటల తరబడి డ్యాన్స్ చేస్తూనే ఉన్నాడు.

అసలు ఈ పెళ్లి కొడుకుకి ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చిందో అని అందరూ ఆశ్చర్యపోయారు.ఎంత డ్యాన్స్ చేసినా అస్సలు తగ్గట్లేదు అతని ఉత్సాహం.

చివరికి అందరూ బాబోయ్, ఇతని ముందు ఎవరైనా దిగదుడుపే అని అనుకునే ఉంటారు.

ఎంతసేపని డాన్స్ చేస్తాడు పాపం, ఫైనల్ గా అలిసిపోయి తన భార్య ఒడిలో వాలిపోయాడు.అక్కడితో తన డాన్స్ పర్ఫామెన్స్ కి ఫుల్ స్టాప్ పెట్టాడు.మొత్తానికి పెళ్లి కొడుకు చేసిన ఈ రచ్చ మాత్రం మామూలుగా లేదు.

పెళ్లికి వచ్చిన వాళ్ళతో పాటు, వీడియో చూసిన వాళ్ళకి కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్ దొరికింది.అందుకే వీడియో చూసిన వాళ్లంతా ఫిదా అయిపోతున్నారు.rakesh.3154 అనే ఇన్‌స్టా అకౌంట్ లో ఈ వీడియో పోస్ట్ చేశారు.అక్కడ వీడియోకి మిలియన్ల వ్యూస్, లైక్స్ వచ్చాయి.కామెంట్స్ సెక్షన్ డిసేబుల్ చేశారు కానీ, వీడియో చూసిన వాళ్లంతా మనసులోనే ఈ పెళ్లి కొడుకుని మెచ్చుకుంటున్నారు.

అతని ఎనర్జీకి, ఉత్సాహానికి సెల్యూట్ చేస్తున్నారు.ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube