సూపర్ బౌల్ కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తున్న వేళ.యాపిల్ బాస్ టిమ్ కుక్ మాత్రం న్యూ ఆర్లీన్స్ లో ప్రత్యక్షమయ్యారు.
ఆయన ఒక్కరే కాదు, యాపిల్ టాప్ ఎగ్జిక్యూటివ్స్ కూడా కుక్‌తో కలిసి ఈ బిగ్ గేమ్‌ను ఎంజాయ్ చేయడానికి విచ్చేశారు.టిమ్ కుక్ ఒక లోకల్ రెస్టారెంట్‌లో ఫుడ్ ఆర్డర్ చేస్తూ కనిపించారు పక్కనే NFL స్టార్ ప్లేయర్ ఓడెల్ బెక్‌హామ్ జూనియర్ (Star player Odell Beckham Jr.)ఉన్నారు.చూడటానికి సింపుల్‌గా, ఎలాంటి హడావిడి లేకుండా టిమ్ కుక్ అక్కడున్న జనాల మధ్యలో కలిసిపోయారు.
చాలామంది ఆయనను గుర్తుపట్టనే లేదు కూడా.ప్రశాంతంగా లూసియానా స్పెషల్ శాండ్‌విచ్ పో’బాయ్స్‌ను ఆరగించారంతే.
డొమిలిస్ పో’బాయ్స్ & బార్‌లో (Domilis Po’Boys & Bar)యంగ్ స్టాఫ్ మెంబర్స్ బెక్‌హామ్‌ను మాత్రం ఇట్టే గుర్తుపట్టేశారు.కానీ కుక్‌ను, యాపిల్ సర్వీసెస్ చీఫ్ ఎడ్డీ క్యూను(Apple Services Chief Eddy Cue) మాత్రం ఎవరూ పట్టించుకోలేదు.
కానీ ఆ తర్వాత డొమిలిస్ బార్ వాళ్లే స్వయంగా కుక్ శాండ్‌విచ్ తింటున్న పిక్ పెట్టి ఇన్‌స్టాగ్రామ్‌లో రచ్చ చేశారు.

న్యూ ఓర్లీన్స్‌లో(New Orleans) ఉన్నంతసేపు కుక్ ఖాళీగా లేరు.యాపిల్ ఉద్యోగులను కూడా కలిశారు.లక్ సైడ్ షాపింగ్ సెంటర్‌లోని యాపిల్ స్టోర్‌కు వెళ్లి స్టాఫ్, కస్టమర్స్‌కు షాక్ ఇచ్చారు.
యాపిల్ రిటైల్ చీఫ్ డెయిర్డ్రే ఓ’బ్రియన్ కూడా కుక్‌తో పాటు అక్కడికి రావడంతో సందడి నెలకొంది.తర్వాత ఓ’బ్రియన్ ఇన్స్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ కూడా పెట్టారు.“టిమ్‌తో కలిసి న్యూ ఓర్లీన్స్‌లోని యాపిల్ లక్ సైడ్ షాపింగ్ సెంటర్‌ను విజిట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది.అక్కడి టీమ్‌తో టైమ్ స్పెండ్ చేయడం మంచిగా అనిపించింది.ఇంత మంచి ఎక్స్‌పీరియన్స్‌తో వీకెండ్ స్టార్ట్ చేయడం నిజంగా అద్భుతం.” అని ఆమె పోస్ట్ చేశారు.

కుక్‌కు మాత్రం ఈ వీకెండ్ ఓ పండుగల గడిచిపోయింది.బౌర్బన్ స్ట్రీట్‌లో స్ట్రీట్ సైడ్ రేవ్‌లో కూడా ఆయన కనిపించారట.అంతేకాదు, బాల్కనీలో పెర్ఫార్మ్ చేస్తున్న డీజే ఖలీద్‌ను కూడా మీట్ అయ్యారు.మొత్తానికి న్యూ ఓర్లీన్స్‌లో కుక్ ఫుల్ గా ఎంజాయ్ చేశారని చెప్పుకోవచ్చు.







