ఈ రోజు పంచాంగం ( Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.46
సూర్యాస్తమయం: సాయంత్రం.6.17
రాహుకాలం: మ.3.00 సా4.30
అమృత ఘడియలు: చతుర్దశి మంచిది కాదు.
దుర్ముహూర్తం: ఉ.8.24 ల9.12 రా.10.46 ల11.36
మేషం:

ఈరోజు కుటుంబమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి.సంఘంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది.అన్ని రంగాల వారికీ పరిస్థితులు అనుకూలిస్తాయి.
వృత్తి ఉద్యోగాలలో మీ విలువ మరింత పెరుగుతుంది.నూతన వాహనం కొనుగోలు చేస్తారు.వ్యాపారమున అంచనాలు అందుకుంటారు.
వృషభం:

ఈరోజు కొన్ని వ్యవహారాలలో ఇతరుల నుండి సమస్యలు కలుగుతాయి.వృత్తి వ్యాపారాలలో కొంత ప్రతికూల వాతావరణం ఉంటుంది.దూర ప్రయాణాలు వ్యర్థంగా ఉంటాయి.
ఖర్చులు ఆదాయానికి మించి ఉంటాయి.ఉద్యోగమున అధికారులతో వాదనలకు వెళ్లకపోవడానికి మంచిది.
మిథునం:

ఈరోజు ఊహించని ప్రయాణాలు చేస్తారు.చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది.ఋణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది.వృత్తి ఉద్యోగాలలో అదనపు పని భారం వలన మానసిక సమస్యలు కలుగుతాయి.కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి.
కర్కాటకం:

ఈరోజు చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.చాలాకాలంగా వేధిస్తున్న సమస్యలకు పరిష్కారం అవుతాయి.సంఘంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి.
నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.వ్యాపార వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి.
సింహం:

ఈరోజు వృత్తి వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయటం వలన నష్టాలు తప్పవు.దీర్ఘకాలిక రుణ ఒత్తిడి అధికమౌతుంది.చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి.గృహ వాతావరణం కొంత చికాకుగా ఉంటుంది.ఉద్యోగమున అధికారుల ఆగ్రహానికి గురవుతారు.
కన్య:

ఈరోజు సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.ఇంటా బయట ప్రశాంత వాతావరణం ఉంటుంది.ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది.
నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరిగినప్పటికీ ఆశించిన లాభాలు పొందుతారు.
తుల:

ఈరోజు దూరపు బంధువుల నుండి అందిన సమాచారం కొంత ఆశ్చర్యం కలిగిస్తుంది.ఉదర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.ఆదాయ మార్గాలు మందగిస్తాయి.శుభకార్యాల కొరకు వృధా వ్యయం చేస్తారు.వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి.
వృశ్చికం:

ఈరోజు దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి.కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది.చేపట్టిన పనులలో జాప్యం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు.
దీర్ఘ కాలిక ఆరోగ్య సమస్యల నుంచి కొంత బయటపడతారు.వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు.
ధనుస్సు:

ఈరోజు చిన్ననాటి మిత్రులతో ఒక వ్యవహారంలో వివాదాలు కలుగుతాయి.వృత్తి వ్యాపారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి కావు.అవసరానికి చేతిలో ధనం నిలువ ఉండదు.నిరుద్యోగులకు లభించిన అవకాశాలు చేజారుతాయి.
మకరం:

ఈరోజు దూరప్రాంత బంధు మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.అవసరానికి ఆప్తుల సహాయ సహకారాలు అందుతాయి.
వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు.ఉద్యోగస్తులకు విధులలో ఆటంకాలు తొలగుతాయి.నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.
కుంభం:

ఈరోజు అన్ని వైపుల నుండి లాభాలు అందుకుంటారు.దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.ఆరోగ్య విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి.
సమాజంలో పెద్దల ఆదరణ కలుగుతుంది.ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది.వ్యాపార విషయమై ఇతరుల సలహాలు అంతగా కలిసిరావు.
మీనం:

ఈరోజు ఇంటా బయట ఊహించని ఖర్చులు ఎదురవుతాయి.ప్రయాణాలలో వాహన విషయంలో ఇబ్బందులుంటాయి.దైవానుగ్రహంతో కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు.
వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు చికాకు కలిగిస్తాయి.







