ప్రముఖ వ్యాపారవేత్త, లులు గ్రూప్ ఛైర్మన్ ఎం.ఏ.
యూసుఫ్ అలీ (Lulu Group Chairman M.A.Yusuff Ali)తన సంస్థలో పనిచేసే ఒక ఉద్యోగి మరణిస్తే కన్నీటి పర్యంతమయ్యారు.అంతేకాదు, స్వయంగా ఆ ఉద్యోగి పాడె మోసి అందరినీ ఆశ్చర్యపరిచారు.
షిహాబుద్దీన్ (Shihabuddin)అనే వ్యక్తి అబుదాబిలోని అల్ వహ్దా మాల్‌లో ఉన్న లులు హైపర్‌మార్కెట్‌లో సూపర్‌వైజర్‌గా పనిచేసేవాడు.ఈ ఎన్నారై కేరళలోని తిరూర్ కన్నమనాన్ ప్రాంతానికి చెందిన వ్యక్తి.
గుండెపోటు రావడంతో హఠాత్తుగా మరణించారు.షిహాబుద్దీన్ అంతిమ సంస్కారాల వీడియోను యూసుఫ్ అలీ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
యూసుఫ్ అలీ(Yusuff Ali) చేసిన పనికి నెటిజన్లు ఫిదా అయిపోయారు.కామెంట్ల వర్షం కురిపించారు.“నిజమైన బాస్ అంటే ఇలా ఉండాలి.హ్యాట్సాఫ్!” అని ఒకరు కామెంట్ చేస్తే, “ఒక బిలియనీర్, కంపెనీ యజమాని తన ఉద్యోగి కోసం ప్రార్థనలు చేయడం గ్రేట్, మానవత్వం అంటే నిజంగా ఇదే” అని మరొకరు పొగిడారు.

యూసుఫ్ అలీ ఇలా సహాయం చేయడం కొత్తేమీ కాదు.ఇంతకుముందు కూడా కేరళకు చెందిన ఓ మహిళ అప్పుల బాధతో ఇల్లు కోల్పోతే ఆమెకు అండగా నిలిచారు.ఇల్లు తాకట్టు పెట్టి తీసుకున్న అప్పు తీర్చలేక ఆ మహిళ రోడ్డున పడింది.ఈ విషయం తెలుసుకున్న యూసుఫ్ అలీ(Yusuff Ali) వెంటనే స్పందించారు.ఆమె అప్పు మొత్తం కట్టేయమని తన ఇండియా టీమ్‌కు ఆదేశించారు.అంతేకాదు, అదనంగా ఆమెకు రూ.10 లక్షలు కూడా ఇచ్చి ఆదుకున్నారు.

సంధ్య అనే ఆ మహిళ 2019లో తన ఇంటి కోసం మనప్పురం ఫైనాన్స్ అనే సంస్థలో రూ.4 లక్షలు అప్పు తీసుకుంది.అయితే 2021లో ఆమె భర్త పిల్లల్ని వదిలి వెళ్ళిపోయాడు.
దీంతో అప్పు కట్టడం ఆమెకు భారంగా మారింది.అసలు, వడ్డీ కలిసి అప్పు మొత్తం దాదాపు రూ.8 లక్షలకు చేరింది.మూడేళ్లపాటు చాలాసార్లు హెచ్చరించినా ఆమె డబ్బు కట్టలేకపోయింది.
దీంతో ఫైనాన్స్ కంపెనీ కఠిన నిర్ణయం తీసుకుంది.సంధ్య ఉద్యోగానికి వెళ్లిన సమయంలో ఇంటికి వచ్చిన ఫైనాన్స్ సిబ్బంది ఇంటికి తాళం వేసి ఆమెను పిల్లలతో సహా బయటకు గెంటేశారు.
కట్టుబట్టలతో రోడ్డున పడ్డ ఆ కుటుంబం తమ వస్తువులు కూడా తెచ్చుకోలేకపోయింది.సంధ్య కష్టాల గురించి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చాలామంది చలించిపోయారు.
ఆమె దుస్థితికి కదిలిపోయిన యూసుఫ్ అలీ ఆమెకు కొత్త జీవితాన్ని ప్రసాదించారు.







