షాకింగ్ సర్వే : బిడెన్ రెస్ట్ తీసుకో...డెమొక్రాట్స్ లో తీవ్ర వ్యతిరేకత...!!!

అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ మరో సారి అధ్యక్షుడిగా పోటీ చేసే అవకాశం లేదా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.అతడికి పోటీ చేసే అర్హత లేదని, తాను అధికారంలోకి వచ్చిన తరువాత అమెరికా ఆర్ధిక పరిస్థితి అతలాకుతలం అయ్యిందనే వాదనలు బలంగా వినిపిస్తున్నారు.

 Shocking Survey On Us President Joe Biden,joe Biden, Us President,inflation,fina-TeluguStop.com

ఈ వ్యాఖ్యలు చేసింది ప్రతిపక్ష పార్టీకి చెందిన వారు అంటే రాజకీయ వ్యాఖ్యలుగా కొట్టిపారేయచ్చు కానీ సాక్షాత్తు బిడెన్ సొంత పార్టీ డెమోక్రటిక్ పార్టీకి చెందిన ప్రజలే ఈ తరహా వ్యాఖ్యలు చేయడం సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది.వివరాలలోకి వెళ్తే.

న్యూయార్క్ టైమ్స్ అలాగే సియానా కాలేజ్ సంయుక్తంగా నిర్వహించిన ఓ సర్వే ఇప్పుడు అమెరికాలో డెమోక్రటిక్ పార్టీ నేతల్లో కలకలం రేపుతోంది.ముఖ్యంగా బిడెన్ వర్గం ఈ సర్వే రిపోర్ట్ పై గుర్రుగా ఉందట.2024 లో బిడెన్ అధ్యక్షుడిగా తమకు వద్దంటూ సుమారు 64 శాతం మంది సొంత పార్టీకి చెందిన ప్రజలు వ్యతిరేకత వ్యక్తం చేశారట.30 ఏళ్ళ వయసు వారైతే సుమారు 94 శాతం మంది బిడెన్ అభ్యర్ధిత్వాన్ని ఏ మాత్రం అంగీకరించడం లేదని తేల్చి చెప్పింది.అయితే

బిడెన్ పై ఈ స్థాయిలో వ్యతిరేకత రావడానికి గల కారణాలు ఏంటంటే విషయాలు కూడా వెల్లడించింది.ఉద్యోగాల కల్పనలో, ఆర్ధిక అభివృద్ధిలో వారు తీవ్ర అసంతృప్తి గా ఉంటున్నారట.

అమెరికా ప్రస్తుతం ఎదుర్కుంటున్న ఆర్ధిక ద్రవ్యోల్బణం బిడెన్ అసమర్ధత కారణంగానే వచ్చిందనే భావనలో వారు ఉన్నారని తెలిపింది సర్వే ఈ విషయాన్ని సుమారు 96 శాతం మంది ధ్రువీకరించారట.ఇక అధ్యక్షుడికి వయసు 79 ఏళ్ళు ఉంటే తమలా ఎలా ఆలోచన చేస్తాడని అందుకే తాము కొత్త అధ్యక్షుడు కావాలని కోరుకుంటున్నామని అమెరికా యువతరం బల్లగుద్ది మరీ చెప్తోందట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube