వరదలకు చంద్రం మోకాలడ్డు... అజ్ఞానేస్ శోకాలు ! విజయసాయి విసుర్లు 

ప్రస్తుతం ఏపీలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది.ఎగువ నుంచి వస్తున్న భారీ వరదతో తెలంగాణతో పాటు, ఏపీ కూడా అతలాకుతలం అవుతోంది.

 Ycp Mp Vijayasai Reddy Satirical Comments On Nara Chandrababu And Lokesh Details-TeluguStop.com

ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి.ఇదే విషయంపై టిడిపి అధినేత చంద్రబాబు వైసిపి ప్రభుత్వం పై విమర్శలు చేశారు.

దీనికి కొనసాగింపుగా టిడిపి అనుకూల మీడియాలో వరద సన్నద్ధత ఏది అంటూ ఏపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఓ కథనం ప్రచురితమైంది.దీనిని టిడిపి సోషల్ మీడియా కూడా బాగా వైరల్ చేస్తుంది.

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్పందించారు.విజయ సాయి సోషల్ మీడియా అకౌంట్ లో చంద్రబాబు లోకేష్ పై తీవ్ర విమర్శలు చేశారు.
  ” అవునులే చంద్రం .నువ్వు సీఎంగా ఉండి ఉంటే వరదలకు మోకాలు అడ్డు పెట్టి వరదలని ఆపేసేవాడివి.లేదా ధవలేశ్వరం బ్యారేజీ దగ్గర షూటింగ్ చేసి వందమందిని చంపేసే వాడివి.15 కోట్ల లగ్జరీ బస్సు వేసుకొచ్చి సహాయక చర్యలమైనా అడ్డం పడేవాడివి.ఈ డ్రామాలేవీ లేకుండా సాయం అందుతుంటే పచ్చ మీడియాకు కడుపు మంటే.” అంటూ చంద్రబాబు టిడిపి అనుకూల మీడియాపై కామెంట్స్ చేశారు.మరో పోస్ట్ లో నారా లోకేష్, చంద్రబాబు ఇద్దరి పైన కామెంట్ చేశారు.
 

” అంత ఇజనరీ అయితే కృష్ణానదిని పూడ్చి కట్టిన అక్రమ కొంపలో ఎందుకు ఉంటున్నట్టో ? రెండుసార్లు మునిగితే ఇల్లు వదిలి పారిపోయాడు.పప్పు అఙ్ఞానేస్ ఏమో బ్యారేజ్ గేట్లకు పడవ అడ్డంపెట్టి కరకట్ట ఇంటిని ముంచారని శోకాలు పెట్టాడు.మరి ఇజన్ ఏమైంది ? కాకులు ఎత్తుకుపోయాయా ?” అంటూ సోషల్ మీడియా ద్వారా వ్యంగ్యంగా కౌంటర్లు ఇచ్చారు.ప్రస్తుతం ఏపీలో అధ్వాన్న పరిస్థితుల్లో ఉన్న రోడ్లు, వరదల పై ఏపీ లో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube