టాలీవుడ్ స్టార్ హీరో మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.రవితేజ ప్రస్తుతం సినిమాలలో నటిస్తూ బిజీ గా ఉన్న విషయం తెలిసిందే.
క్రాక్ సినిమాతో మంచి విషయం అందుకున్న రవితేజ ఆ తర్వాత ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్నాడు.ఇటీవలే నటించిన ఖిలాడి సినిమా ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే.
రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం రామారావు ఆన్ డ్యూటీ.ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే.
కాగా ఇందులో రవితేజ రజీషా, దివ్యాంశ హీరోయిన్ లుగా నటిస్తున్నారు.
అయితే హీరోయిన్ దివ్యాంశ తన ఆశలన్నీ కూడా ఈ సినిమాపైనే పెట్టుకుంది.
మొదట మజిలి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన దివ్యాంశ ఆ సినిమాలో అన్షు పాత్రతో ప్రేక్షకులను అలరించింది.అయితే ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత టక్కర్ మూవీతో కోలీవుడ్‌లో అరంగేట్రం చేసింది.
ఇక త్వరలోనే రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది ఈ అమ్మడు.ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పాటలకు మంచి ప్రేక్షకాదరణ లభించింది.
అయితే ఈసారి అయినా తనకు మంచి బ్రేక్ వస్తుందేమోనని కొండంత ఆశతో ఎదురు చూస్తోంది దివ్యాంశ.

మరి దివ్యాంశకు రామారావు ఆన్ డ్యూటీ ఏమేరకు ప్లస్ అవుతుందో చూడాలి మరి.మరి దివ్యాంశ అనుకున్న విధంగా ఈ రామారావు ఆన్ డ్యూటీ సినిమా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చి పెడుతుందా లేదా చూడాలి మరి.ఈ సినిమాకు శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్నారు.అలాగే ఈ సినిమాలో సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి, నాజర్, తనికెళ్ల భరణి, పవిత్రా లోకేశ్ ముఖ్యపాత్రల్లో నటించారు.శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ, రవితేజ టీమ్ వర్క్స్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మించారు.







