ఆ రైతుబిడ్డ పెద్ద వెధవ.. నా అన్వేషణ అన్వేష్ షాకింగ్ కామెంట్స్ నెట్టింట వైరల్!

యూట్యూబ్ ఛానెల్స్( YouTube channels ) ద్వారా పాపులారిటీని సంపాదించుకున్న యూట్యూబర్లు తమ వీడియోల ద్వారా బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయడంతో ఎంతోమంది లక్షల్లో డబ్బులను పోగొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి.

ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ( Telangana RTC MD Sajjanar )బెట్టింగ్ యాప్స్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే.

బెట్టింగ్ యాప్స్ ను ఇకపై ప్రమోట్ చేయబోమని కొందరు సెలబ్రిటీలు చెబుతున్నారు.అయితే యూట్యూబర్ అన్వేష్( YouTuber Anvesh ) సైతం బెట్టింగ్ యాప్స్ కు వ్యతిరేకంగా పోరాడుతున్నాడు.

బెట్టింగ్ యాప్స్( Betting apps ) ను ప్రమోట్ చేస్తున్న వాళ్లపై అన్వేష్ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తుండగా పల్లవి ప్రశాంత్ పై కూడా అన్వేష్ విమర్శలు చేయడం గమనార్హం.ప్రపంచంలో తాను ఎక్కువగా అసహ్యించుకునేది పల్లవి ప్రశాంత్ నే అని అన్వేష్ కామెంట్లు చేశారు.

Shocking Statements Viral About Pallavi Prashanth Details Inside Goes Viral In

పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ రైతు బిడ్డ అంటూ బిగ్ బాస్ విజేతగా గెలిచారని ప్రైజ్ మనీ రైతులకు ఇస్తానని చెప్పి ఇవ్వలేదని అన్వేష్ చెప్పుకొచ్చారు.దేశానికి రైతు వెన్నముక అని చెప్పిన పల్లవి ప్రశాంత్ ఏనాడైనా రైతుల కష్టాల గురించి కానీ సేంద్రీయ వ్యవసాయం గురించి కానీ వీడియోలు చేశాడా అని ఆయన కామెంట్లు చేశారు.బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి పల్లవి ప్రశాంత్ తనను గెలిపించిన జనాలకు నమ్మకద్రోహం చేశాడని అన్వేష్ చెప్పుకొచ్చారు.

Shocking Statements Viral About Pallavi Prashanth Details Inside Goes Viral In
Advertisement
Shocking Statements Viral About Pallavi Prashanth Details Inside Goes Viral In

అన్వేష్ చెప్పిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.ఈ కామెంట్ల గురించి పల్లవి ప్రశాంత్ రియాక్ట్ అవుతారో లేదో చూడాల్సి ఉంది.పల్లవి ప్రశాంత్ ను చూస్తే అసహ్యమని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం చట్టరిత్యా నేరంఅని పేర్కొన్నారు.

రాబోయే రోజుల్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ విషయంలో పల్లవి ప్రశాంత్ పై కూడా కేసు నమోదవుతుందేమో చూడాలి.ఈ కామెంట్ల వల్ల పల్లవి ప్రశాంత్ కు ఇబ్బందులు తప్పవని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు