మోసగాడు అని తెలిసినా ఇంటికి పిలిచి మర్యాద చేసిన శ్రీహరి.. గొప్పోడంటూ?

సినిమా రంగానికి చెందిన కొంతమంది సెలబ్రిటీలు ఆస్తులను సంపాదించుకోవడంపై దృష్టి పెడితే మరి కొందరు మనుషులను సంపాదించుకోవడంపై దృష్టి పెడతారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో శ్రీహరి గొప్పదనం గురించి కథలుకథలుగా చెప్పుకుంటారు.

ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే శ్రీహరి తన వంతు సహాయం చేశారు.ఆయన రెమ్యునరేషన్ తీసుకోకుండా నటించిన సినిమాలు కూడా ఉన్నాయని సమాచారం.

ఒక ఇంటర్వ్యూలో శ్రీహరి భార్య డిస్కో శాంతి మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు.శ్రీహరికి కోపం ఎక్కువని చాలామంది అనుకుంటారని ఆయనకు నిజ జీవితంలో కోపం అస్సలు రాదని ఆమె అన్నారు.శ్రీహరిగారు అందరినీ నమ్ముతారని ఆయనలో నచ్చిన లక్షణం కూడా అదేనని డిస్కో శాంతి పేర్కొన్నారు.

ఎవరొచ్చి ఏది చెప్పినా నమ్ముతారని అతను దొంగ అని చెప్పినా ఆయన మర్యాద చేస్తారని డిస్కోశాంతి అన్నారు.శ్రీహరికి చిన్నకొడుకు అంటే ఎక్కువ ఇష్టమని ఆమె తెలిపారు.

Advertisement

గొడవ పడితే శ్రీహరి మొదట రాజీ పడేవారని డిస్కో శాంతి తెలిపారు.శ్రీహరిని నేను బావ అని పిలుస్తానని ఆయన కూడా నన్ను బావ అని పిలుస్తారని ఆమె చెప్పుకొచ్చారు.

హీరో అయ్యే వరకు శ్రీహరి సినిమాలను నేను చూడలేదని డిస్కో శాంతి పేర్కొన్నారు.శ్రీహరి గొప్పోడని ఇండస్ట్రీలో చాలామంది భావిస్తారు.

హీరోగా శ్రీహరి వరుసగా 9 విజయాలను అందుకున్నారు.సినిమా ఇండస్ట్రీలో ట్రిపుల్ హ్యాట్రిక్ సాధించిన హీరోల సంఖ్య తక్కువేనని చెప్పాలి.నువ్వొస్తానంటే నేనొద్దంటానా, మగధీర సినిమాలలోని పాత్రలకు శ్రీహరి కాకుండా మరొకరు న్యాయం చేసేవారు కాదు.

ఈ జనరేషన్ లో కూడా శ్రీహరికి ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు.చిన్న వయస్సులోనే శ్రీహరి మరణం ఎంతోమందిని బాధ పెట్టింది.

కమల్ హాసన్ భారతీయుడు 3 తో మరోసారి నట విశ్వరూపాన్ని చూపించబోతున్నాడా..?
కీర్తి సురేష్ పెళ్లి చీర కోసం అన్ని గంటలు కష్టపడ్డారా.. ఆ చీర ప్రత్యేకత ఏంటో తెలుసా?

ఆయన స్థానాన్ని పూర్తిస్థాయిలో భర్తీ చేసే నటుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో లేరని చాలామంది భావిస్తారు.

Advertisement

తాజా వార్తలు