డార్లింగ్ ఫ్యాన్స్ కు ట్రిపుల్ ట్రీట్.. 8 నెలల్లోనే మూడు మూవీస్ రిలీజ్!

బాహుబలి సిరీస్ భారీ విజయంతో ప్రభాస్ పేరు మారుమోగి పోయింది.యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాస్త పాన్ ఇండియన్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

 Prabhas Movies Latest Update Adipurush Salaar Project K Details, Prabhas , Prabh-TeluguStop.com

ఈ ఒక్క సినిమా ప్రభాస్ కెరీర్ ను పూర్తిగా మార్చేసింది అనే చెప్పాలి.అప్పటి వరకు డార్లింగ్ అంటే కేవలం సౌత్ వారికీ మాత్రమే పరిచయం.

కానీ ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో గ్లోబల్ వైడ్ గా పేరు తెచ్చుకున్నాడు.

ఇక ఈ సినిమా తర్వాత వరుసగా పాన్ ఇండియన్ సినిమాలను లైన్లో పెడుతూ తన మార్కెట్ ను పెంచుకుంటున్నాడు.

వరుస షూటింగులతో ఏ మాత్రం విశ్రాంతి లేకుండా గడుపుతున్న డార్లింగ్ త్వరలోనే కొత్త సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతున్నాడు.ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 8 నెలల వ్యవధిలోనే మూడు సినిమాలతో ట్రిపుల్ ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు.

Telugu Salaar, Adipurush, Prabhas, Nag Ashwin, Pan India, Prabhas Fans, Project-

మరి ప్రభాస్ సినిమాల్లో ముందుగా ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్న సినిమా ”ఆదిపురుష్”.బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ఈ సినిమా భారీ స్థాయిలో తెరకెక్కింది.రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా జూన్ 16న రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అవుతుంది.ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా పడి జూన్ 16 న ఫిక్స్ అయ్యింది.

Telugu Salaar, Adipurush, Prabhas, Nag Ashwin, Pan India, Prabhas Fans, Project-

ఇక డార్లింగ్ నుండి రాబోతున్న మరో సినిమా సలార్. ఈ సినిమాను కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.హోంబలే వారు భారీ స్థాయిలో హాలీవుడ్ రేంజ్ లో సినిమాను నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమాను సెప్టెంబర్ 28న రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేసారు.

అలాగే ప్రభాస్ నుండి రాబోతున్న మూడవ సినిమా ప్రాజెక్ట్ కే.నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.500 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండగా దీపికా పదుకొనె, అమితాబ్ బచ్చన్ వంటి భారీ తారాగణం ఇందులో భాగం అయ్యారు.ప్రాజెక్ట్ కే సినిమాను వచ్చే ఏడాది జనవరి 12న 2024లో రిలీజ్ చేయనున్నట్టు డేట్ లాక్ చేసారు.ఇలా ప్రభాస్ ఏకంగా 8 నెలల వ్యవధిలోనే మూడు సినిమాలతో ట్రిపుల్ ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube