లీడర్ కథ పుట్టుక వెనుక ఇంత కథ ఉందా.. ఈ కథకు ఆ కానిస్టేబుల్ కారణమా?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ దర్శకులలో శేఖర్ కమ్ముల( Shekhar Kammula ) ఒకరు కాగా ఈ డైరెక్టర్ డైరెక్షన్ లో తెరకెక్కిన లీడర్ మూవీ ( Leader movie )మంచి సినిమాగా పేరును సొంతం చేసుకున్నా కమర్షియల్ గా ఆశించిన విజయాన్ని అయితే అందుకోలేదనే సంగతి తెలిసిందే.

శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కిన ఎన్నో సినిమాలు ఫీల్ గుడ్ సినిమాలుగా మంచి పేరును సొంతం చేసుకున్నాయి.

అయితే లీడర్ సినిమా కథ పుట్టుక వెనుక ఒక కానిస్టేబుల్ ఉన్నారని తెలుస్తోంది.వినడానికి ఒకింత ఆశ్చర్యంగా అనిపించినా సమాజం విషయంలో, వ్యవస్థ విషయంలో ప్రతి ఒక్కరికీ కోపం ఉందని ఆయన అన్నారు.

చదువుకున్న యువకులలో చాలామందిలో ఈ కోపం ఉందని ఆయన చెప్పుకొచ్చారు.మన దేశంలో కార్పొరేటర్ ను జైలులో పెట్టాలన్నా చాలా ఒత్తిడి ఉంటుందని ఆయన వెల్లడించారు.

మన దేశంలో పేదవాడి వైపు న్యాయం ఉన్నా న్యాయం జరగదని ఆయన పేర్కొన్నారు.

Advertisement

ఇది పచ్చి నిజం అని శేఖర్ కమ్ముల చెప్పుకొచ్చారు.అమెరికాకు( america ) తాను వెళ్లిన సమయంలో కారు పార్కింగ్ కోసం ఇబ్బంది పడ్డానని ఆయన తెలిపారు.అమెరికాలో కానిస్టేబుల్స్ లైట్ ఫ్లాష్ చేస్తారని అలా లైట్ ఫ్లాష్ చేస్తే అక్కడ కారు పార్క్ చేయకూడదని అర్థం అని పేర్కొన్నారు.

కానిస్టేబుల్ పై గౌరవంతో కారు పార్క్ చేయరని అక్కడ తప్ప చేస్తే టికెట్స్ జనరేట్ అయ్యి లైసెన్స్ తీసుకుంటారని ఆయన తెలిపారు.

మన దేశంలో పోలీసులకు భయపడకుండా రూల్స్ బ్రేక్ చేస్తున్నామని అలా లీడర్ కథ పుట్టిందని శేఖర్ కమ్ముల వెల్లడించారు.లీడర్ కథ పుట్టుక వెనుక ఒక కానిస్టేబుల్ ఉన్నారని తెలిసి నెటిజన్లు సైతం ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు.లీడర్ మూవీ కమర్షియల్ రిజల్ట్ ఎలా ఉన్నా ఎంతోమందికి ఈ సినిమా ఫేవరెట్ మూవీ అనే సంగతి తెలిసిందే.

పాన్ ఇండియాలో తెలుగు వాళ్ళు తప్ప మిగితా సౌత్ హీరోలు ఎందుకు క్లిక్ అవ్వడం లేదు...
Advertisement

తాజా వార్తలు