సీఎంను గౌరవించాలని నేవీలో నేర్పలేదా?శివసేన మండిపాటు!

ముంబైలో నేవీ రిటైర్డ్ అధికారి మదన్ శర్మపై శివసేన పార్టీ కార్యకర్తలు దాడి చేసిన అంశం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ఒక నేవీ రిటైర్డ్ అధికారి పై దాడి చేయడం ఏంటని అన్ని వర్గాల ప్రజల నుండి శివసేన విమర్శలు ఎదర్కొంటుంది.

దీన్ని దృష్టి మళ్ళించడం కోసం శివసేన తమ అధికార పత్రిక అయిన సామ్నా లో తాజాగా ఓ కథనం ప్రచారం చేసింది.ప్రస్తుతం ఈ కథనం బాగా వైరల్ అవుతుంది.

Shivasena Latest Comments On Navy Officer, Mumbai, Navy Officer, Madhan Sharma,

ఇంతకీ ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం.సామ్నా వేదికగా శివసేన నేవీ రిటైర్డ్ అధికారి మదన్ శర్మపై తీవ్రంగా విరుచుకుపడింది.

ప్రజలచే ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రిని ఎలా గౌరవించాలన్న ప్రాథమిక విషయాన్ని మీరు నేవీలో నేర్చుకోలేదా? అంటూ మదన్ శర్మను ప్రశ్నించింది.ముంబైలో నేవీ రిటైర్డ్ అధికారిపై శివసైనికులు దాడి చేసిన సంఘటనను ఎవరమూ సమర్థించం.

Advertisement

దీన్ని ఖచ్చితంగా ఖండించాల్సిందే.కానీ ప్రజల ద్వారా ఎన్నికైన ఉద్ధవ్ ఠాక్రేపై కొన్ని వ్యంగ్య కార్టూన్ లను షేర్ చేయడం ద్వారా మీరు పొందిన లబ్ధి ఏంటి? చెప్పండి అంటూ శివసేన ప్రశ్నించింది.ఈ తతంగాన్ని చూసిన బీజేపీ నాయకులు తమపై వస్తున్న వ్యతిరేకతను డైవర్ట్ చేయడం కోసం శివసేన ఇలాంటి ఎదురుదాడి కార్యక్రమాలకు దిగుతుందని అంటున్నారు.

అమెరికాలో భారత సంతతి గ్యాంగ్‌స్టర్ అరెస్ట్ .. ఎఫ్‌బీఐ చీఫ్ కాష్ పటేల్ కీలక వ్యాఖ్యలు
Advertisement

తాజా వార్తలు