ఈ సీజన్ తెలుగు బిగ్ బాస్ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.ఆడియన్స్ ఈ సీజన్ అప్పుడే అయిపోతుందే, ఇంకా కొన్ని రోజులు ఉంటే బాగుండును అని అనుకునేంతలా ఈ సీజన్ హిట్ అయ్యింది.ఈ సీజన్ లో దాదాపుగా ప్రతీ ఒక్కరు తమకంటూ ఒక ప్రత్యేకమైన మార్కుని ఏర్పాటు చేసుకున్నారు.10 వారాలు దాటగానే మన అందరికీ టైటిల్ ని కొట్టబోయేది ఎవరో తెలిసిపోతుంటాది.కానీ ఈ సీజన్ లో మాత్రం టైటిల్ విన్నర్ ఎవరో కనుక్కోవడం చాలా కష్టం అయిపోయింది.అమర్ దీప్, శివాజీ మరియు పల్లవి ప్రశాంత్ ముగ్గురికి కూడా సమానమైన అవకాశాలు ఉన్నాయి.15 వారాలు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ తో ఆడియన్స్ ని అలరించిన ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో మరో రెండు రోజుల్లో ముగియబోతుంది.హాట్ స్టార్ లో 24*7 లైవ్ స్ట్రీమింగ్ కూడా ఆపేసారు.
![Telugu Amardeep, Arjun Amabati, Bigg Boss, Biggboss, Tasks-Movie Telugu Amardeep, Arjun Amabati, Bigg Boss, Biggboss, Tasks-Movie](https://telugustop.com/wp-content/uploads/2023/12/Bigg-Boss-7-Grand-Finale-arjun-amabati-Anchor-Sreemukhi-Bigg-Boss-7-Funny-tasks-Amardeep.jpg)
ఇక గ్రాండ్ ఫినాలే(Bigg Boss 7 Grand Finale ) కి సంబంధించిన షూటింగ్ ని కూడా మొదలు పెట్టేశారట.మూడు రోజుల పాటు ఈ షూటింగ్ ఉంటుందని సమాచారం.ఈరోజు హౌస్ లోకి సూపర్ సింగర్స్ సరికొత్త సీజన్ ప్రొమోషన్స్ లో భాగంగా యాంకర్ శ్రీముఖి( Anchor Sreemukhi ) హౌస్ లోకి వెళ్ళింది అట.ఆమె వెళ్ళింది ఉత్త చేతులతో మాత్రం కాదు, 20 లక్షల రూపాయిల ప్రైజ్ మనీ తో అట.హౌస్ మేట్స్ అందరినీ ఆమె టెంప్ట్ చేసింది కానీ ఎవ్వరూ కూడా 20 లక్షల రూపాయిలను తీసుకునేందుకు ఇష్టపడలేదట.అందరికంటే అర్జున్ చివర్లో ఉన్నాడని తెలుసు కదా, ఆయన ఇది తీసుకొని వెళ్లుంటే బాగుండేది అని ఆయన అభిమానులు అనుకున్నారు.
కానీ ఎందుకు తీసుకోలేదు అనేది ఎల్లుండి ఎపిసోడ్ లో తెలుస్తుంది.ఇదంతా పక్కన పెడితే గురువారం రోజు జరిగిన కొన్ని ఫన్నీ టాస్కులను( Funny tasks ) టీవీ లో ప్రస్తుతం టెలికాస్ట్ చేస్తున్నారు.
![Telugu Amardeep, Arjun Amabati, Bigg Boss, Biggboss, Tasks-Movie Telugu Amardeep, Arjun Amabati, Bigg Boss, Biggboss, Tasks-Movie](https://telugustop.com/wp-content/uploads/2023/12/Bigg-Boss-7-Grand-Finale-Sreemukhi-Funny-tasks.jpg)
నిన్న గ్రహాంతర వాసులతో కాసేపు సరదాగా హౌస్ మేట్స్ గడిపిన సంగతి తెలిసిందే.ఈరోజు అమర్ దీప్ జ్యోతిష్యుడిగా కనిపించి కాసేపు ఎంటర్టైన్మెంట్ ని అందించాడు.ఇవి కాకుండా కళ్ళకు గంతలు కట్టుకున్న తర్వాత హౌస్ మేట్స్ అందరూ కళ్ళ గంటలు కట్టుకున్న కంటెస్టెంట్ ని కొడుతారు అట.ఎవరెవరు ఎక్కడ కొట్టారు అనేది గంతలు కట్టుకున్న కంటెస్టెంట్ చెప్పాలట.ఈ టాస్కులో శివాజీ తో పాటుగా, అందరూ కొట్టించుకున్నారు.చాలా సరదాగా, ఫన్ తో సాగిపోయిన ఈ టాస్కుని చూస్తే ప్రేక్షకులు పొట్టచెక్కలు అయ్యేలా నవ్వుకుంటారట.ఫిజికల్ అవ్వకూడదు అని రూల్స్ పెట్టిన బిగ్ బాస్ ఏకంగా కొట్టుకునే టాస్కు ఇవ్వడం ఆశ్చర్యార్ధకం.చూడాలి మరి ఈ చివరి ఎపిసోడ్స్ ఎలా ఉంటాయి అనేది.