మాజీ టిఆర్ఎస్ మంత్రి, బీజేపీ నేత ఈటెల రాజేందర్ ఘాటు పదజాలం తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విరుచుకుపడ్డారు.హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి రాజేందర్ కానీ, ఆయన భార్య కానీ పోటీ చేయబోతున్న క్రమంలో ఈ నియోజకవర్గంలో పట్టు పెంచుకునేందుకు, మళ్లీ తమకు విజయం దక్కేలా చేసుకునేందుకు ఇప్పటి నుంచే రాజేందర్ అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
సోమవారం నుంచి ‘ ప్రజా జీవన యాత్ర పేరుతో రాజేందర్ పాదయాత్ర చేపట్టారు.ఈ యాత్రలో టిఆర్ఎస్ ను పూర్తిగా ఆయన టార్గెట్ చేసుకుంటున్నారు.
పాదయాత్రలో భాగంగా శనిగరం లో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.
హుజూరాబాద్ నియోజకవర్గం లో ఉన్న సర్పంచులకు కెసిఆర్ వెల కట్టారని, ఈ విషయం తనకు తెలుసన్నారు.తనను చంపేందుకు జిల్లా మంత్రి కుట్రలు చేస్తున్నారని, హంతక ముఠా లతో చేతులు కలిపి తనను చంపేందుకు కుట్ర చూస్తున్నారనే విషయం తన దృష్టికి వచ్చిందన్నారు.‘ అరె కొదక్కల్లారా ఖబద్ధార్ ! నరహంతకుడు నయీం చంపుతా అంటేనే భయపడలేదు.మీ చిల్లర ప్రయత్నాలకు అసలు భయపడను.ఉగ్గుపాలతో ఉద్యమాలు చేసిన వాడిని, ఈటల మల్లయ్య కొడుకుని , ఆత్మగౌరవం కోసం ఏ స్థాయిలో అయినా కొట్లాడుతా.దుబ్బాక లో ఏం జరిగిందో ఇక్కడా అదే జరుగుతుంది. 2018 లో నన్ను ఓడించేందుకు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు అండగా నిలిచారు.
ఇప్పుడూ నిలుస్తారు.చట్టం మీద నాకు విశ్వాసం ఉంది.
పోలీసులు సహకరించండి.అంటూ రాజేందర్ వ్యాఖ్యానించారు.
రాజేందర్ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణలో కలకలం సృష్టిస్తున్నాయి.

టిఆర్ఎస్ పూర్తిగా ఆయనను టార్గెట్ చేసుకుందనే విషయాన్ని రాజేందర్ ప్రజల్లోకి తీసుకెళ్లడం తో పాటు తనను చంపేందుకు టిఆర్ఎస్ చూస్తోంది అనే విధంగా మాట్లాడడం వల్ల హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు సెంటిమెంట్ ఏర్పడుతుందని, అది తమకు కలిసి వస్తుందనేది రాజేందర్ ఎత్తుగడగా కనిపిస్తోంది.ఇక పాదయాత్ర పూర్తయ్యేనాటికి నిత్యం ఏదో ఒక అంశంపై టిఆర్ఎస్ నువ్వు ఇరుకున పెట్టాలని వ్యూహంతో రాజేందర్ ముందుకు వెళ్తున్నట్లు గా కనిపిస్తున్నారు.