రాజధాని రైతుల మహాపాదయాత్ర ను పోలీసులతో అడ్డుకోవాలని చూడటం దుర్మార్గమని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు.పోలీసులు మహా పాదయాత్ర నిర్వాహకులకు నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఆయన ఖండించారు.
పార్టీలకు అతీతంగా ప్రజల నుంచి స్వచ్ఛందంగా పాదయాత్రకు వస్తున్న ప్రజాధరణ చూసి వైసీపీ ప్రభుత్వానికి వణుకు పుడుతోందన్నారు.విచ్చలవిడిగా ప్రజా సంకల్పయాత్ర వేడుకలు చేసిన వైసీపీకు కొవిడ్ నిబంధనలు వర్తించవా.
మహాపాదయాత్ర కు వర్తిస్తాయా అని పుల్లారావు ప్రశ్నించారు.
ప్రకాశం జిల్లా పర్చూరులో పాదయాత్ర వద్దకు ఎవరినీ రానీయకుండా పోలీసులు అడ్డుకోవడందుర్మార్గ చర్య అన్నారు.
న్యాయస్థాన నిబంధనల ప్రకారం రాజధాని రైతులు పాదయాత్ర చేస్తుంటే సంఘీభావం తెలియ చేయడానికి వస్తున్న ప్రజలను ఇబ్బంది పెట్టడం దారుణమన్నారు.దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం అన్నారు.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల నిర్ణయం తో అమరావతి ప్రజా రాజధానిలో రెండు లక్షల కోట్ల సంపద ఆవిరైపోతుందన్నారు.ప్రజలపై భారం పడుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించే వరకు వైసీపీ ప్రభుత్వంపై పోరాటం పోరాటం చేస్తామన్నారు మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు.







