హీరో లీగల్ నోటీసులకు స్పందించిన నిర్మాతలు

యంగ్‌ హీరో శర్వానంద్ ఇటీవలే శ్రీకారం సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సందే.

భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా కు విడుదల సమయంలో మరింత హైప్‌ పెరిగింది.

సినిమా వ్యవసాయం నేపథ్యంలో అవ్వడం వల్ల విడుదల తర్వాత విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు.ప్రేక్షకుల నుండి పాజిటివ్‌ రెస్పాన్స్ వచ్చింది.

కాని కరోనా ఇతరత్ర కారణాల వల్ల సినిమా వసూళ్ల విషయంలో చాలా నిరుత్సాహ పర్చింది.దాంతో శర్వానంద్‌ హీరోగా అందుకోవాల్సిన పారితోషికంను అందుకోలేదు.

ఆరు కోట్ల పారితోషికంను మాట్లాడుకుని నాలుగు కోట్లు తీసుకున్న శర్వానంద్‌ బ్యాలన్స్ కోసం చాలా రోజులుగా అడుగుతూ ఉన్నాడు.ఎట్టకేలకు చిత్ర నిర్మాతలు స్పందించక పోవడంతో లీగల్ నోటీసులను శర్వానంద్‌ పంపించాడు.

Advertisement

దాంతో వెంటనే 14 రీల్స్‌ నిర్మాతలు స్పందించారు.శర్వానంద్‌ కు ఇవ్వాల్సిన పారితోషికం విషయమై వారు మాట్లాడుతూ చిన్న మిస్ కమ్యూనికేషన్‌ వల్ల ఇది జరిగింది.

ఖచ్చితంగా త్వరలోనే ఈ వివాదంను క్లీయర్‌ చేసుకుంటామంటూ వారు క్లారిటీ ఇచ్చారు.మీడియాలో ఈ విషయమై కాస్త సీరియస్ గా పుకార్లు షికార్లు చేస్తున్నాయని మీడియాలో జరిగినట్లుగా మా మద్య వివాదం విభేదాలు ఏమీ లేవని క్లారిటీ ఇచ్చింది.పెద్ద ఎత్తున అంచనాలున్న శ్రీకారం సినిమా ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేక పోవడం వల్ల శర్వానంద్‌ పారితోషికంను ఇవ్వలేదు అంటూ కొందరు అంటున్నారు.50 లక్షల రూపాయలను ఇచ్చిన వారు మరో కోటిన్నర బ్యాలన్స్ ఉన్నట్లుగా చెబుతున్నారు.శర్వానంద్‌ ఈ విషయంలో కాస్త చూసి చూడనట్లుగా వ్యవహరించాలని కొందరు విజ్ఞప్తి చేస్తుంటే మరి కొందరు మాత్రం సినిమాకు మంచి బిజినెస్ అయ్యింది.

కనుక సినిమా పారితోషికం పూర్తి గా ఇవ్వాల్సిందే అంటున్నారు. నిర్మాతల స్పందినతో శర్వా ఎలా రియాక్ట్‌ అవుతాడో చూడాలి.

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు