షర్మిల వ్యూహం అదే.. అందుకే డీకే తో ప్లాన్స్ !

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల( Y.S.Sharmila ) తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయబోతుందని గత కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.

ఈ వార్తలను షర్మిల కూడా ఖండించకపోవడంతో నిజమేనని రాజకీయ వర్గాలు కొడై కుస్తున్నాయి.

అటు టి కాంగ్రెస్ లోని కొంతమంది నేతలు షర్మిల రాకను స్వాగతిస్తున్నారు.దీంతో షర్మిల కాంగ్రెస్ గూటికి ఎప్పుడు చేరబోతుంది ? పార్టీ విలీనానికి ముహూర్తం ఎప్పుడు అనే ప్రశ్నలు తరచూ తెరపైకి వస్తూనే ఉన్నాయి.అయితే షర్మిల కాంగ్రెస్ లో చెరకుండా రేవంత్ రెడ్డి అడ్డుకుంటున్నారని.

అందుకే పార్టీ విలీనంపై షర్మిల మౌనం వహిస్తోందని కొందరి వాదన.

అయితే ఈ వాదనలో నిజం కూడా లేకపోలేదు.ఎందుకంటే టి కాంగ్రెస్ కు షర్మిల అవసరం లేదని, ఏపీ కాంగ్రెస్ లో చేరితే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని రేవంత్ రెడ్డి( Revanth reddy ) బహిరంగంగానే చెప్పుకొచ్చారు.అయితే షర్మిల ఏపీ రాజకీయాల్లోకి వెళ్ళే అవకాశం దాదాపు లేనట్లే.

Advertisement

ఎందుకంటే అక్కడ తన అన్న జగన్మోహన్ రెడ్డితో పోటీ పడవలసివస్తుంది.అంతే కాకుండా తాను తెలంగాణ బిడ్డనని, తాన రాజకీయ ప్రస్థానం తెలంగాణలో మాత్రమే కొనసాగుతుందని షర్మిల గతంలోనే స్పస్టతనిచ్చారు.

దీంతో ఆమె తెలంగాణలో రాజకీయాల్లోనే కొనసాగుతారని క్రియర్ కట్ గా తెలిసిపోయింది.

కాగా ప్రస్తుత పరిస్థితుల్లో తన పార్టీని ముందుకు తీసుకెల్లే పరిస్థితి లేదు ఎందుకంటే ప్రధాన పోటీ బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల మద్యనే ఉండే అవకాశం ఉంది.అందుకే ఆమె వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి హస్తం పార్టీ తరుపున పోటీ చేయాలని భావిస్తోంది.కానీ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి షర్మిల రాకను అడ్డుకుంటున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానానికి అత్యంత సన్నిహితంగా ఉండే కర్నాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ ను రంగంలోకి దించింది షర్మిల.

ఇప్పటికే పలు మార్లు డీకేతో భేటీ అయిన ఆమె తాజాగా మరోసారి కూడా డీకేతో భేటీ అయింది.డీకే శివకుమార్( D.K.Shivakumar ) ద్వారా అధిష్టానంతో విలీనంపై తుది నిర్ణయం తీసుకువడానికి సిద్దమైంది.దీంతో ఒకవేళ షర్మిలా పార్టీ విలీనానికి కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే రేవంత్ రెడ్డి వైఖరి ఎలా ఉండబోతుందనేది కూడా అసక్తికరంగా మారింది.

రూ. 1 కోటి ప్రశ్నకు సరైన సమాధానం చెప్పినా.. కంటెస్టెంట్ కి నిరాశే..?
అల్లు అర్జున్ అరెస్టు పెద్ద కుట్ర ఉంది.. సింగర్ కల్పన షాకింగ్ కామెంట్స్?

మరి టి కాంగ్రెస్ లో చేరేందుకు షర్మిల వేస్తున్న ప్లాన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.

Advertisement

తాజా వార్తలు