ఆ జిల్లా పైనే కవిత ఫోకస్ ఎందుకంటే .. ?

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, కెసిఆర్( CM kcr ) కుమార్తె కల్వకుంట్ల కవిత ఈ మధ్యకాలంలో రాజకీయంగా యాక్టివ్ అయ్యారు .ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత కొంతకాలం సైలెంట్ గానే కనిపించిన ఆమె ఇప్పుడు మాత్రం పార్టీలో తన పట్టు పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

 Because The Focus Of The Poem Is On That District-TeluguStop.com

ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు.ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ జిల్లాపై దృష్టి పెట్టి తరుచుగా పర్యటనలు చేస్తున్నారు.2014లో నిజామాబాద్ ఎంపీగా గెలిచిన తర్వాత ఉమ్మడి జిల్లాలోని  నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోనూ సత్త చాటుకున్నారు పూర్తిగా తన పట్టు నిలుపుకున్నారు.కానీ 2019లో ఎంపీగా పోటీ చేసిన కవిత బిజెపి ధర్మపురి అరవింద్ ( Dharmapuri Arvind )చేతిలో ఓటమి చెందారు.

అప్పటి నుంచి ఈ జిల్లా వ్యవహారాలను పట్టించుకోవడమే మానేశారు.

Telugu Brs Mlc, Congress, Kavitha, Telangana-Politics

 ఒక దశలో ఆమె తన ఓటు హక్కును కూడా హైదరాబాద్ కు మార్చుకుని పూర్తిగా జిల్లాకు దూరమయ్యారనే ప్రచారం జరిగింది.అయితే కవితకు ఎమ్మెల్సీ దక్కడంతో తరచుగా ఈ జిల్లాలో పర్యటిస్తున్నారు.గతంలో ఈ జిల్లాలో యాక్టివ్ గా ఉన్న నేతలు తనతో సన్నిహితంగా మెలుగుతూ వారందరినీ కలుపుకుని వెళ్తూ,  అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

అలాగే ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ బిజీగా ఉంటున్నారు.సర్వేల ఆధారంగానే సిట్టింగులకు టికెట్లు కేటాయిస్తామని కేసీఆర్ ప్రకటించినా,  కవిత ( Kavitha )వాటిని పట్టించుకోకుండా ఈ జిల్లాలో  తన పట్టు పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

జిల్లాలు , మండలాలు , నియోజకవర్గాల వారిగా సమావేశాలు నిర్వహిస్తూ కేడర్ కు దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తున్నారు .నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న కవిత రాజకీయ భవిష్యత్తు గత కొంతకాలంగా గందరగోళంగా నే ఉంది.కొద్ది రోజుల క్రితం ఎంపీ అరవింద్ చేసిన విమర్శలు పైన ఆమె స్పందించారు.

Telugu Brs Mlc, Congress, Kavitha, Telangana-Politics

వచ్చే ఎన్నికల్లో వెంటపడి ఓడిస్తానని సవాల్ చేశారు.దీంతో మళ్లీ నిజామాబాద్ ఎంపీగా బీఆర్ఎస్ ( BRS party )నుంచి పోటీ చేసేందుకు కవిత సిద్ధంగా ఉన్నారని,  అందుకే ఈ జిల్లా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి తరచుగా పర్యటనలు చేస్తున్నారనే అనుమానాలు పార్టీ క్యాడర్ తో పాటు, ప్రత్యర్ధి పార్టీల నేతల్లోనూ కలుగుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube