షర్మిల పార్టీలో తొలి నియామకం... ఎవరంటే?

తెలంగాణలో రాజకీయ సంచలనాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి.ఒక్కసారిగా షర్మిల పార్టీ ఏర్పాటు చేస్తానని ప్రకటించడంతో ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది.

 Sharmila's First Appointment In The Party Who ,y.s.sharmila, Telangana Politics,-TeluguStop.com

తెలంగాణలో రాజన్న రాజ్యం కావాలంటూ షర్మిల ప్రకటనపై తెలంగాణలోని ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున మండిపడ్డ విషయం తెలిసిందే.అయితే తాజాగా షర్మిల పార్టీ నుండి మరో అప్డేట్ వచ్చింది.

షర్మిల పార్టీలో తొలి నియామకం చేపట్టింది.షర్మిల కార్యక్రమాల ఇంచార్జిగా వాడుక రాజగోపాల్ ను నియమించింది.

ఎన్నో ఏళ్లుగా వై.ఎస్.కుటుంబంతో రాజగోపాల్ కు చక్కని అనుబంధం ఉంది.ఇప్పటికే ఇతర పార్టీలలో అసంతృప్తి నేతలు టచ్ లోకి రావడంతో మరింత జోష్ గా షర్మిల తన పార్టీ ఏర్పాటు పనులను మరింత వేగవంతం చేసింది.

షర్మిల వేస్తున్న ప్రతి అడుగును గమనిస్తున్న ప్రతిపక్షాలు ఆచీతూచిగా మాట్లాడుతూ సరైన సమయంలో సమాధానం చెపుతాం అన్నట్లుగా ప్రతిపక్షాలు వేచి చూస్తున్నట్టు తెలుస్తోంది.చూద్దాం షర్మిల పార్టీ ఇంకెన్ని రాజకీయ వర్గాలలో ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది.

అంతేకాక ఇక పార్టీ పేరు విధివిధానాల ప్రకటన తరువాత మరిన్ని నియామకాలు ఉండే అవకాశం ఉంది.ఇక షర్మిల పార్టీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube