మూడు అజెండాలతో షర్మిల వైఎస్సార్ తెలంగాణా పార్టీ..!

తెలంగాణాలో మరో పార్టీ ఏర్పడింది.కొద్దిరోజులుగా ప్రచారంలో ఉన్న షర్మిల పార్టీ పేరుని అధికారికంగా ప్రకటించారు.

తమ పార్టీ పేరు వైఎస్సార్ తెలంగాణా పార్టీ అని చెప్పారు వైఎస్ షర్మిల.హైదరాబాద్ జే.ఆర్.సీ కన్వెషన్ లో ఏర్పాటు చేసిన పార్టీ ఆవిర్భావ సభలో ఆమె పార్టీ పేరుని ఆవిష్కరించారు.తమ పార్టీ అజెండాలోని మూడు ముఖ్యమైన అంశాలను ఆమె వెల్లడించారు.

సంక్షేమం, స్వయం సమృద్ది, సమానత్వం అనే మూడు ముఖ్యమైన అంశాలతో తమ పార్టీ పనిచేస్తుందని అన్నారు.ప్రజలకు ఆత్మ నిబ్బరం వేటి వల్ల కలిగించగలమో.రేపటిపై భరోసా ఎలా ఇవ్వగలమో అదే సంక్షేమమని.

తమని తాము అభివృద్ధి పరచుకునేలా వైఎస్ మార్క్ సంక్షేమం.వైఎస్ చూపించిన సంక్షేమ బాట లోనే ఇప్పుడు అందరు వెళ్తున్నారని అన్నారు.

Advertisement

తరాలు మారుతున్నా ప్రజల తాల్రాతలు మారట్లేదు.సంక్షేమం అంతా రేషన్ బియ్యం చుట్టూ తిరుగుతుంది.

ఈ తరానికి స్వయం సమృద్ధి సాధించేందుకు అవసరమైన సంక్షేమం ఉండట్లేదు.స్వయం సమృద్ధి ఆత్మవిశ్వాసంలా బతికేందుకు ఉపయోగపడుతుందని అన్నారు.

కాళ్ల మీఎద నిలబడటం అంటే పేదరికం నుండి మధ్యతరగతి వైపు.మధ్యతరగతి నుండి స్వయం సమృద్ధి వైపు కదలాని.

ఎవరిపైనా ఆధారపడకుండా ఆత్మగౌరవంతో బ్రతకాలని అన్నారు.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
కాంగ్రెస్ రాజకీయం ముందు బీజేపీ బచ్చా.. : జగ్గారెడ్డి

ఇక ఒక పువ్వుకు ఉన్న రంగు, రూపం, సువాసన మరొక పువ్వుకి ఉండదు.ఎన్నో పూలతో పేర్చిన బతుకమ్మ ఎంత అందంగా ఉంటుందో వివిధ వర్గాలను ఒకచోట చేరిస్తే అది అందమైన తెలంగాణ అవుతుందన్ అన్నారు.వైఎస్సార్ కులమతాలకు అతీతంగా అందరిని సమానంగా గౌరవించారు.

Advertisement

సమానంగా చూశారు.వైఎస్సార్ తెలంగాణా పార్టీ కూడా ఈ సూత్రాన్నే స్పూర్తిగా తీసుకుంటుందని అన్నారు వైఎస్ షర్మిల.

తాజా వార్తలు