షర్మిల బాధ ఇదా ? వారు అస్సలు పట్టించుకోవడం లేదా ? 

ఏదో ఊహించుకుని తెలంగాణలో కొత్త పార్టీని స్థాపించి శరవేగంగా ప్రజలు బలం పెంచుకునేందుకు వైయస్సార్ టిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రయత్నిస్తున్నారు.

ముఖ్యంగా తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ ను ఆమె ఎక్కువగా టార్గెట్ చేసుకున్నారు.

సాధారణంగా అధికార పార్టీపై కొంతకాలం తర్వాత ప్రజల్లో వ్యతిరేకత ఉంటుంది.అదీ కాకుండా, టిఆర్ఎస్ పార్టీ రెండు సార్లు అధికారంలోకి రావడంతో ఇప్పుడు ఆ వ్యతిరేకత తీవ్రంగా కనిపిస్తోంది.

ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్ పట్టించుకోకపోవడం, కొన్నిటిని మాత్రమే అమలు చేయడం, ఇంకా అనేక అంశాలలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఇలా ఎన్నో వ్యవహారాలు టిఆర్ఎస్ కు ఇబ్బందికరంగా మారాయి.టిఆర్ఎస్ తప్పిదాలను హైలెట్ చేసుకుంటూ తెలంగాణలో బలపడేందుకు కాంగ్రెస్ బీజేపీలు ప్రయత్నాలు చేస్తున్నాయి.

      ఈ రెండు పార్టీల రూట్ లోనే తెలంగాణలో తన పట్టు నిరూపించుకునేందుకు షర్మిల ప్రయత్నాలు చేస్తున్నారు.ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష చేపడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు.

Advertisement

ఇంకా ఆమె అనేక అంశాలపై కెసిఆర్ పైన ప్రశ్నల వర్షం కురిపిస్తూ, విమర్శలు చేస్తున్నారు.  కానీ షర్మిల విమర్శలను కెసిఆర్ తో పాటు ఆ పార్టీ నాయకులు ఎవరు పెద్దగా పట్టించుకోవడం లేదు.

ఆమె ఎన్ని రకాలుగా విమర్శలు చేసినా, తమను కాదు అన్నట్లుగానే వారంతా వ్యవహరిస్తుండడం షర్మిలకు మరింత అసంతృప్తి రాజేస్తోంది.ఇప్పటికే పార్టీలో పెద్దగా చేరికలు కనిపించకపోవడం, ఉన్న నేతలూ ఒక్కొక్కరుగా జారుకుంటూ ఉండడం, ఇలా ఎన్నో అంశాలు షర్మిలకు ఇబ్బందికరంగా మారాయి.     

 ఎన్ని రకాలుగా టిఆర్ఎస్ ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్న , అటువైపు నుంచి రెస్పాన్స్ కనిపించకపోవడంతో తమను టిఆర్ఎస్ నాయకులు పట్టించుకోవడం లేదనే సంకేతాలు జనంలోకి వెళ్లిపోతాయని , ఇది తమ పార్టీ రాజకీయ భవిష్యత్తు కు ఇబ్బందులు తెచ్చిపెడతాయి అనే టెన్షన్ షర్మిల లో ఎక్కువగా కనిపిస్తుంది.తెలంగాణలో ఎన్ని కార్యక్రమాలు చేపట్టిన రెస్పాన్స్ మాత్రం అంతంత మాత్రంగానే ఉండడం తో ఏం చేయాలో పాలుపోని స్థితిలో షర్మిల ఉన్నట్టుగా కనిపిస్తున్నారు.

రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!
Advertisement

తాజా వార్తలు