తెలంగాణలో రాజకీయం కొత్త పొంతలు తొక్కుతూ హాట్ హాట్ గా మారిపోయిన పరిస్థితి ఉంది.ఇప్పటికే టీఆర్ఎస్ ప్రభుత్వం రెండో సారి అధికారం చేపట్టే నాటి పరిస్థితులకు ఇప్పటికీ చాలా వ్యత్యాసం ఉంది.
రాజకీయ పరిస్థితులు మారిపోయిన పరిస్థితి ఉంది.తెలంగాణ రాజకీయాల్లో షర్మిల ఎంట్రీ అన్నది ఒక్కసారిగా అందరినీ షాక్ కు గురి చేసిందని చెప్పవచ్చు.
అసలు ఏ మాత్రం చడీ చప్పుడు లేకుండా ఓ ప్రముఖ దినపత్రిక కథనంతో వెలుగులోకి వచ్చిన షర్మిల ఎంట్రీని తొలుత ఎవరూ విశ్వసించకున్నా ఆ తరువాత షర్మిల నిర్ధారించడంతో వెలుగులోకి వచ్చింది.
ఇక ఆ తరువాత జిల్లాల వారిగా కార్యకర్తలతో సమావేశమవుతూ పార్టీ ఏర్పాటుపై నేతల, కార్యకర్తల అభిప్రాయం తీసుకోవడం, ఇక వచ్చే నెల జూన్ 18 న పార్టీ పేరును అధికారికంగా ప్రకటిస్తున్న విషయం తెలిసిందే.
అయితే ఇక కదన రంగానికి షర్మిల సిద్దమైనట్టు తెలుస్తోంది.కేసీఆర్ పై ఇప్పటికే ఘాటు కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్న షర్మిల ఇక వచ్చే సార్వత్రిక ఎన్నికలకు షర్మిళ సన్నద్దమవుతున్నట్టు తెలుస్తోంది.