షణ్ముఖ్, దీప్తి పెళ్లి.. షాకింగ్ కండిషన్ పెట్టిన పేరెంట్స్.. అలా అయితేనే ఒప్పుకుంటాం!

యుట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

యూట్యూబ్ లో పలు వెబ్ సిరీస్ ల ద్వారా బాగా పాపులర్ అయిన షణ్ముఖ్ జస్వంత్ సోషల్ మీడియాలో అదేరీతిలో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్నాడు.

అదే క్రేజ్ తో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.ప్రస్తుతం తెలుగు బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ ల లో ఒకరిగా ఉన్నాడు.

ఇది ఇలా ఉంటే బిగ్ బాస్ హౌస్ లో ఇటీవల కంటెస్టెంట్ ల ఫ్యామిలీ మెంబర్స్ వచ్చిన విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే షణ్ముఖ్ మదర్ ఉమారాణి కూడా వచ్చింది.

అప్పుడు షణ్ముఖ్ తన తల్లితో అమ్మా దీప్తిని కలిసావా? ఎలా ఉంది? బాగుందా? నిజం చెప్పు దీప్తి టచ్ లో ఉందా? అంటూ షణ్ముఖ్ తన తల్లిని దీప్తి గురించి పదేపదే అడిగాడు.అప్పుడు షణ్ముఖ్ మదర్ కలిసాను బాగానే ఉంది అని చెప్పడంతో.

Advertisement

నిజం చెప్పు నామీద ఒట్టు అని షణ్ముఖ్ అనడంతో.అమ్మ అబద్ధం చెప్తుందా ఎందుకు అలా అడుగుతున్నావ్? అంటూ ఆమె కాస్త అసహనం వ్యక్తం చేసింది.షణ్ముఖ్ జస్వంత్ మదర్ బయట ఇంటర్వ్యూలలో కూడా దీప్తి గురించి పెద్దగా మాట్లాడలేదు.

పైగా వాళ్ళిద్దరూ జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే.ఇక పెళ్లి.లవ్ అంటారా? రెండు ఫ్యామిలీస్ చర్చించి ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటాం అని తెలిపింది.ఇది ఇలా ఉంటే తాజాగా షణ్ముఖ్, దీప్తి సునైనా పెళ్లి విషయం పై ఓపెన్ కామెంట్స్ చేశారు షణ్ముఖ్ పేరెంట్స్.

షన్ను,దీప్తిని ప్రేమిస్తున్నట్లు మాకు ఇంకా చెప్పలేదు.వాళ్ళు యూట్యూబ్ వీడియోల ద్వారా ఇద్దరు ఫేమస్ అయ్యారు.మంచి ఫ్రెండ్స్ అని అనుకున్నాం.

కానీ ఆ తర్వాత పలు టీవీ షో లోకి వెళ్లడం.టాటూలు వేయించుకోవడం ఇవన్నీ చూసిన తరువాత లవ్ లో ఉన్నారని తెలిసింది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

ఆ తరువాత షణ్ముఖ్ లవ్ విషయం మాకు చెప్పాడు.అప్పుడు కూడా మాకు ఫ్రెండ్స్ అని చెప్పాడు అని తెలిపారు.అదేవిధంగా ప్రేమ.

Advertisement

పెళ్లి గురించి మా మధ్య డిస్కషన్ జరగలేదని తెలిపారు షణ్ముఖ్ పేరెంట్స్.దీప్తి కూడా మా కుటుంబంతో చాలా సరదాగా ఉంటుంది.

మా ఇంటికి కూడా వస్తూ ఉంటుందని తెలిపారు.అలాగే షణ్ముఖ్ కి అన్నయ్య ఉన్నాడు.

ఇంకా పెళ్లి కాలేదు.ముందు మా పెద్ద అబ్బాయికి పెళ్లి అయితేనే షణ్ముఖ్ పెళ్లి చేస్తాం అని తెలిపారు షణ్ముఖ్ పేరెంట్స్.

దీప్తి సునైనా పేరెంట్స్ కూడా ఓకే అయితే మాకు కూడా ఓకే.వాళ్లకి ఇష్టం లేకుండా పెళ్లి చేయం అంటూ దీప్తి, షన్నుల రిలేషన్ గురించి, ప్రేమ, పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చారు షన్ను పేరెంట్స్.

తాజా వార్తలు