కాళ్లతో పరీక్షలు రాసి డిస్టింక్షన్ లో ఉత్తీర్ణత.. ఈ విద్యార్థి సక్సెస్ కు హ్యాట్సాఫ్ అనాల్సిందే!

చేతులు లేకపోయినా కష్టపడి పని చేసి పరీక్షల్లో మంచి మార్కులు సాధించడం సులువైన విషయం కాదు.అయితే ఒక విద్యార్థి మాత్రం చేతులు లేకపోయినా పది, ఇంటర్ పరీక్షలలో మంచి మార్కులు సాధించి ప్రశంసలు అందుకుంటున్నారు.

12వ తరగతి పరీక్షలో ఏకంగా 78 శాతం మార్కులు సాధించిన ఈ విద్యార్థి సక్సెస్ స్టోరీ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోందని కామెంట్లు వినిపిస్తున్నాయి.మహారాష్ట్ర ( Maharashtra )రాష్ట్రానికి చెందిన ఒక విద్యార్థి అరుదైన ఘనత సాధించగా ఆ ఘనత ప్రస్తుతం సోషల్ మీడియా( Social media) వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.

మహారాష్ట్రలోని లాతూర్ కు చెందిన 17 సంవత్సరాల వయస్సు ఉన్న గౌస్ షేక్ చేతులు లేకుండా జన్మించారు.అయితే కెరీర్ పరంగా సక్సెస్ కావాలని భావించిన గౌస్ షేక్ అవరోధాలను అధిగమించి 12వ తరగతి ఎంతో కష్టపడి పూర్తి చేశారు.

గౌస్ షేక్( Shaik gouse ) తండ్రి ప్యూన్ గా పని చేస్తుండగా ఇంటర్ లో గౌస్ షేక్ సాధించిన మార్కులు చూసి అందరూ ఔరా అంటున్నారు.చేతులు లేకపోయినా గౌస్ షేక్ ఇంట్లో తన పనులు తానే చేసుకునేవాడని సమాచారం అందుతోంది.టీచర్లు ఎంతో కష్టపడి గౌస్ కు కాళ్లతో రాసేలా శిక్షణ ఇవ్వగా ట్రైనింగ్ అనంతరం గౌస్ షేక్ కాళ్లతో వేగంగా రాస్తూ అందరినీ ఆశ్చర్యపరిచి ఇప్పుడు పరీక్షల్లో సైతం మంచి మార్కులు సాధిస్తున్నారు.

Advertisement

గౌస్ షేక్ టాలెంట్ ను నెటిజన్లు ఎంతో మెచ్చుకుంటున్నారు.గౌస్ షేక్ రాబోయే రోజుల్లో ఉన్నత చదువులు చదివి మంచి కొలువు సాధించాలని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

గౌస్ షేక్ ప్రతిభను ఎంత ప్రశంసించినా తక్కువేనని నెటిజన్లు చెబుతున్నారు.తన టాలెంట్ తో గౌస్ షేక్ వార్తల్లో నిలుస్తున్నారు.గౌస్ షేక్ కెరీర్ పరంగా ఒక్కో మెట్టు పైకి ఎదుగుతున్నారు.

Advertisement

తాజా వార్తలు