ఈ ఏడాది ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద రెండు సార్లు వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టి చరిత్ర సృష్టించిన ఏకైక సూపర్ స్టార్ గా షారుఖ్ ఖాన్( Shahrukh Khan ) నిలిచాడు.ఏడాది ప్రారంభం లో ‘పఠాన్’( Pathaan ) చిత్రం తో బాక్స్ ఆఫీస్ ని దున్నేసి వెయ్యి కోట్ల రూపాయిలు కొల్లగొట్టి పడిపోయిన బాలీవుడ్ మార్కెట్ ని నిలిపిన షారుఖ్ ఖాన్, రీసెంట్ గా జవాన్ సినిమాతో మరోసారి ఇండస్ట్రీ రికార్డ్స్ ని కొల్లగొట్టి వెయ్యి కోట్ల రూపాయిలను సాధించాడు.
ఈ సినిమా ఇంకా థియేటర్స్ లో ఉండగానే ఓటీటీ లోకి వచ్చేసింది.మొన్ననే నెట్ ఫ్లిక్స్ లో( Netflix ) తెలుగు , హిందీ , తమిళం , కన్నడ మరియు మలయాళం భాషల్లో విడుదల చెయ్యగా మంచి అద్భుతమైన రెస్పాన్స్ ని దక్కించుకుంది.
సినిమా థియేటర్స్ లో మిస్ అయిన ప్రతీ ఒక్కరు ఈ చిత్రాన్ని ఓటీటీ లో ఎగబడి మరీ చూస్తున్నారు.
అయితే ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లోకి విడుదల అయ్యే ముందు అదనపు సన్నివేశాలు జత చేస్తున్నట్టుగా ఒక రేంజ్ లో పబ్లిసిటీ చేసారు.కానీ అది జరగలేదు, సినిమాలో కేవలం రెండు నిమిషాల సన్నివేశం మాత్రమే జత చేసారు.ఆ సన్నివేశం జత చేసినట్టుగా కూడా ఎవరికీ అనిపించదు, అంత చిన్న సన్నివేశం అన్నమాట.
దీనికి మూవీ టీం చేసిన ప్రొమోషన్స్ అంతా ఇంతా కాదు.జవాన్( Jawan Movie ) కొత్త వెర్షన్ సినిమాని ఓటీటీ లో( OTT ) విడుదల చేస్తున్నాం అని ప్రచారం చేసారు.
ఆ కొత్త వెర్షన్ కేవలం రెండు నిమిషాల సన్నివేశం అని తెలిసి నిరాశకి గురి అయ్యారు.ఏమాత్రం దానికి అంత హంగామా అవసరమా, ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ మరీ అంత పిచ్చోళ్ళు లాగ కనిపిస్తున్నారా అంటూ నెట్ ఫ్లిక్స్ సంస్థ ని ( Netflix ) ట్యాగ్ చేసి సోషల్ మీడియా లో బండ బూతులు తిడుతున్నారు ఫ్యాన్స్.
కేవలం జవాన్ చిత్రానికి మాత్రమే కాదు, రీసెంట్ గా చాలా సినిమాలకు ఓటీటీ పార్టనర్స్ ఇలాగే చేస్తున్నారు.చిన్న సినిమాలకు అలా చెయ్యడం లో తప్పు లేదు.కానీ షారుఖ్ ఖాన్ లాంటి సూపర్ స్టార్ సినిమాలకు ఇలాంటివి చెయ్యాల్సిన అవసరం లేదు.వాళ్ళ సినిమాలు ఓటీటీ లో వస్తుంది అంటే ఎగబడి మరీ చూస్తారు.
అయినా కూడా ఇలాంటి చీప్ పనులు చెయ్యడం ఏమాత్రం బాగాలేదని అంటున్నారు ఫ్యాన్స్.ఇకపోతే షారుఖ్ ఖాన్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘డుంకీ’( Dunki Movie ) ఈ ఏడాది డిసెంబర్ 21 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతుంది.
రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని విడుదల చెయ్యగా దానికి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.