నవంబర్ 30వ తారీకు తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు( Telangana Assembly Elections ) జరగబోతున్న సంగతి తెలిసిందే.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడోసారి జరగబోతున్న ఈ ఎన్నికలలో గెలుపు కోసం ప్రధాన పార్టీలు కృషి చేస్తున్నాయి.
ఈ క్రమంలో ప్రచారంలో దూసుకుపోతున్నాయి.ఇదే సమయంలో తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ నాయకులు.
( BRS ) తెలంగాణలో ప్రత్యర్థులపై అదే రీతిలో ఏపీ ప్రభుత్వంపై( AP Govt ) విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానులు ఇంకా రోడ్లు విషయంలో తెలంగాణ మంత్రులు ఇటీవల సెటైర్లు వేయడం జరిగింది.
ఏపీలో అభివృద్ధి జరగటం లేదని.రకరకాలుగా విమర్శలు చేయడం జరిగింది.
బీఆర్ఎస్ మంత్రి హరీష్ రావు తో( Minister Harish Rao ) పాటు.మరి కొంతమంది ప్రజాప్రతినిధులు ఏపీ ప్రభుత్వ తీరుపై ఎన్నికల ప్రచారంలో ఇటీవల కొన్ని కాంట్రవర్సీ కామెంట్లు చేయడం జరిగింది.దీంతో ఏపీ వైసీపీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి( Kakani Govardhan Reddy ) తెలంగాణ మంత్రులపై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.ఎన్నికల సమయంలో బాగా చేస్తున్నట్లు చెప్పుకోవడానికి తెలంగాణ నేతలు పాట్లు పడుతున్నారని సెటైర్లు వేశారు.
ఎన్నికలు వచ్చాయని అవాకులు చవాకులు పేలుతున్నారు.గతంలో ఈ నాయకులే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పనితీరు బాగుందని ప్రశంసించారు.
ఇప్పుడు ఎన్నికలు వస్తున్నా తరుణంలో అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు అని కాకాణి గోవర్ధన్ రెడ్డి మండి పడటం జరిగింది.