ఈ సీరియల్ నటి ఒక్కరోజు సంపాదన ఎంతో తెలుసా.?

ప్రస్తుత కాలంలో ప్రేక్షకుల్లో సినిమా తారలకు ఏ స్థాయిలో ఆదరణ, గుర్తింపు ఉందో, టీవీ తారలకు కూడా అదే స్థాయిలో ఆదరణ, గుర్తింపు ఉంది.

కొందరు నటీనటులకు సినిమాల కంటే టీవీ సీరియళ్లు, టీవీ షోల ద్వారా ఎక్కువగా గుర్తింపు వస్తోంది.

బుల్లితెర సీరియళ్లలో చాలా సంవత్సరాల నుంచి నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును భావన సొంతం చేసుకున్నారు. సీరియల్స్ లో పాజిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించడంతో పాటు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కూడా భావన నటించడం గమనార్హం.

ప్రస్తుతం సీరియల్ నటీమణులకు కూడా పారితోషికాలు బాగానే ఉన్నాయి.కొంతమంది ఆర్టిస్ట్ లు రోజుకు 20,000 రూపాయల నుంచి 25,000 రూపాయల వరకు పారితోషికం తీసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు.

క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ను బట్టి సీరియల్ ప్రొడ్యూసర్లు సైతం డిమాండ్ ఉన్న నటీనటులకు అడిగినంత పారితోషికం ఇవ్వడానికి ఆసక్తి చూపుతున్నారు.భావన చాలా సంవత్సరాల నుంచి సీరియళ్లతో బిజీగా ఉండటంతో ఆమె ఎక్కువ మొత్తంలో సంపాదించారని చాలామంది భావిస్తారు.

Advertisement

అయితే ఒక సందర్భంలో భావన రెమ్యునరేషన్ గురించి మాట్లాడుతూ ఒక్కో సీరియల్ కు రోజుకు 5వేల రూపాయల నుంచి 7వేల రూపాయల వరకు ఇస్తున్నారని తెలిపారు.అసిస్టెంట్ల ఖర్చులతో పాటు, పెట్రోల్ ఖర్చులు, టీడీఎస్ ఉండటం వల్ల మిగిలే మొత్తం చాలా తక్కువని చెప్పారు.అయితే సంపాదించిన మొత్తంలో కొంత మొత్తాన్ని ఛారిటీకి ఖర్చు చేయడం ద్వారా భావన మంచి పేరును సంపాదించుకున్నారు.

బర్త్ డే రోజున ఈ నటి సెలబ్రేషన్స్ కోసం డబ్బులను ఖర్చు చేయకుండా కేన్సర్ ఆస్పత్రి రోగుల కొరకు డబ్బును ఖర్చు చేస్తూ మంచి మనస్సును చాటుకుంటున్నారు.ఇండస్ట్రీలో ఎవరైనా ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నట్టు తన దృష్టికి వస్తే సాయం చేస్తూ భావన నటిగానే కాక మానవత్వం ఉన్న మనిషిగా గొప్ప పేరును సొంతం చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు