జనతా గ్యారేజ్ కి కష్టాలు తప్పేలా లేవు

రోడ్ సేఫ్టి బిల్ 2015 ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ జాతీయ కార్మిక సంఘాలు సెప్టెంబరు 2న దేశవ్యాప్తంగా బంద్ కి పిలుపునిచ్చన సంగతి తెలిసిందే.అదేరోజు జనతా గ్యారేజ్ విడుదల ఉండటం వలన బంద్ దృష్ట్యా సినిమా విడుదల తేదిని మారుస్తారని అనుకున్నారంతా.

 September 2nd Bandh Is Getting Strong – Jantha Garage In Trouble-TeluguStop.com

కాని అలాంటిదేమి జరగలేదు.బంద్ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చునని భావించి ఉంటారు నిర్మాతదర్శకులు.

కాని బంద్ తీవ్రతరం కానుంది.తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులు ఆల్రెడి సమ్మె నోటీసులు ఇచ్చేసారు.

ఈ దేశవ్యాప్త సమ్మెకి మిగితా కార్మిక సంఘాల నుంచి కూడా మద్దతు లభిస్తోంది.అదీకాక లెఫ్ట్ ఫ్రంట్ మొదటినుంచీ ఈ బంద్ కి సహాయసహకారాలను అందిస్తామని చెబుతూ వస్తోంది.

ఈ సమ్మెలో తెలంగాణ ఆర్‌టిసి నుంచి 35 వేల మంది డ్రైవర్లు, కండక్టర్లు పాల్గొంటారని సమాచారం.ఇదంతా చూస్తోంటే సెప్టెంబరు 2న బంద్ భారి ఎత్తున జరిగేలా ఉంది.

మరి జనతా గ్యారేజ్ నిర్మాతలు ఇప్పుడైనా విడుదల తేదిని మార్చే విధంగా అలోచిస్తారో లేక సెప్టెంబరు 2న సినిమా రావాల్సిందే అని భిష్మించుకు కూర్చుంటారో.విడుదల తేది మార్చకపోతే మాత్రం ఓపెనింగ్స్ దెబ్బతినటం ఖాయమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube