దీపిక పదుకోణెని అవమానించిన హీరో

దీపిక పదుకోణే పక్కన ఒక్కసారైనా నటించాలని ఏ హీరో కోరుకోడు.కేవలం బాలివుడ్ జనాలకే కాదు, దక్షిణాది సూపర్ స్టార్లు రజినీకాంత్, మహేష్ బాబులకి కూడా దీపికానే ప్రస్తుతం ఉన్నవారిలో అభిమాన కథానాయిక.

 Why Salman Khan Isn’t Interested To Meet Deepika Padukone?-TeluguStop.com

అంతటి క్రేజ్ సంపాదించుకుంది కాబట్టే హాలివుడ్ లో అవకాశం వెతుక్కుంటూ వచ్చింది.అయితే ఆ అవకాశం కోసమే సల్మాన్ ఖాన్ సుల్తాన్ లో నటించడానికి దీపిక నిరాకరించిందని చెబుతూ ఉంటారు బాలివుడ్ జనాలు.

అంతేకాదు, కిక్ హిందీ రిమేక్ లో కూడా జాక్వెలీన్ కి ముందు దీపికాను అనుకున్నా, అమ్మడు అప్పుడు ఒప్పుకోలేదట.ఇలా రెండుసార్లు చేదు అనుభవం ఎదురయ్యే సరికి సల్మాన్ భాయ్ మనసు నొచ్చుకొని ఉంటుంది.

ఇప్పుడు ఆ పగ తీర్చుకుంటున్నాడు.

కిక్ తరువాత సల్మాన్ మరింత పెద్ద స్టార్ గా ఎదిగితే, సుల్తాన్ సల్మాన్ ని బాలివుడ్ అగ్రస్థానంలో కూర్చోబెట్టింది.

ఇప్పుడు దీపిక మిత్రుడు షారుఖ్ హవా నడవట్లేదు.కాబట్టి సల్మాన్ తో సత్సంబంధాలు పెంచుకోవాలని అనుకుందో ఏమో .తన హాలివుడ్ సినిమా పూర్తి చేసుకోని ఇండియాకి తిరిగొచ్చిన దీపిక, సల్మాన్ ని కలవడానికి తెగ ప్రయత్నిస్తోందట.

అంత అందమైన హీరోయిన్ కలవాలని ట్రై చేస్తున్నా, అపాయింట్‌మెంట్ అస్సలు ఇవ్వట్లేదట సల్మాన్.

చేదు జ్ఞాపకాలు ఎలా మరచిపోతాడు మరి.ఈ దెబ్బతో దీపిక హాలివుడ్ పొగరంతా దిగిపోయే రేంజ్ లో సల్మాన్ అవమానించాడని చెప్పుకుంటున్నారు బాలివుడ్ జనాలు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube