కాలుష్య నివారణ కు పారిస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాలుష్య సమస్య ఒక్క భారత్ లోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా ఈ కాలుష్య సమస్య వేధిస్తుంది.

ఈ క్రమంలోనే పారిస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

ఆ దేశంలో 60 శాతం కార్ల వినియోగం పై అక్కడి ప్రభుత్వం నిషేధం విధించినట్లు తెలుస్తుంది.పారిస్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయం తో అక్కడ రోడ్ల పై సగానికి పైగా కార్లు తిరగలేని పరిస్థితి ఏర్పడింది.

బాగా పాత పడిన డీజిల్ కార్లను రోడ్లపైకి రావడం పై నిషేధం విధించింది.ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నిబంధనలను ఉల్లఘించొద్దు అని,ఒకవేళ అతిక్రమిస్తే మాత్రం చర్యలు తప్పవంటూ హెచ్చరికలు కూడా జారీ చేసింది.

ఈ ఆదేశాలను కచ్చితంగా పాటించాల్సిందేనంటూ వాహనదారులకు స్పష్టం చేసింది.దీనితో పారిస్ ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయం ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది.

Advertisement

ఫ్రాన్స్‌లో గాలి కాలుష్యాన్ని అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది.అంతేకాకుండా ఈ వాహన కాలుష్యాన్ని నివారించడం కోసం భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని కూడా ప్రోత్సహించనున్నట్లు పారిస్ ప్రభుత్వం పేర్కొంది.

ఈ క్రమంలోనే ఇప్పటికే దేశంలో మొత్తం 5 మిలియన్ల కార్లు రిజిష్టర్ అయినట్లు అధికారులు తెలిపారు.మరోవైపు ఇప్పటికే దేశంలో నీటి వాడకంపై నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయి.నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు గాను ఫ్రాన్స్ ముందస్తు చర్యగా అక్కడ నీటి వాడకం విషయం నిషేదాజ్ఞల నిర్ణయం తీసుకుంది.

అయితే ఇప్పటికే నీటి ఎద్దడితో నానా ఇబ్బందులు పడుతున్న పారిస్ ప్రజలు ఇప్పుడు తాజాగా వాహనాల వినియోగం పై నిషేధం విధించడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు