భారత్‌కు రానున్న యూఎస్ ట్రెజరీ శాఖ డిప్యూటీ సెక్రటరీ.. మూడు రోజుల పాటు ఇక్కడే

బలమైన ద్వైపాక్షిక ఆర్ధిక సంబంధాలను పెంపొందించడానికి , ఇంధన భద్రతా సహకారాన్ని బలోపేతం చేయడానికియూఎస్ ట్రెజరీ డిపార్ట్‌మెంట్ సీనియర్ అధికారి వచ్చే వారం భారతదేశానికి రానున్నారు.

యూఎస్ ట్రెజరీ శాఖ డిప్యూటీ సెక్రటరీ అడెయెమో తన భారతదేశ పర్యటనలో భాగంగా ఆగస్ట్ 24, 25 తేదీలలో ముంబైలోని సీనియర్ ప్రభుత్వ సహచరులతో, ఆర్ధిక సేవలు, ఇంధన రంగాలకు చెందిన ప్రముఖలతో, భారతీయ ఎగ్జిక్యూటివ్‌లతో సమావేశమవుతారు.

అలాగే ఐఐటీ ముంబై సొసైటీ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్టార్టప్ ఇంక్యుబేటర్‌లో పర్యటించనున్నారు.అక్కడ విద్యార్ధులు, వ్యవస్థాపకులతో అడెయెమో సమావేశమవుతారు.

తన పర్యటనలో భాగంగా అడెయెమో యూఎస్- ఇండియా సంబంధాలను బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తారు.ఇరుదేశాల లోతైన ఆర్ధిక, భద్రత, సాంస్కృతిక సంబంధాలను ఆయన పునరుద్ఘాటిస్తారని ట్రెజరీ శాఖ ప్రకటనలో పేర్కొంది.

ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ వర్క్‌లో భారత్ వ్యవస్థాపక సభ్యునిగా చేరిందని ట్రెజరీ శాఖ తెలిపింది.ప్రపంచవ్యాప్తంగా ఇంధన భద్రతను పెంపొందించడం, ఆహార అభద్రతను పరిష్కరించడం, అక్రమ ఆర్ధిక ప్రవాహాలను ఎదుర్కోవడం వంటి కీలకమైన భాగస్వామ్య ప్రాధాన్యతలను కూడా అడెయెమో చర్చించనున్నారు.2023లో జీ20 సమూహానికి భారతదేశం నాయకత్వం వహించనుందని ట్రెజరీ శాఖ తెలిపింది.

Advertisement

ఇకపోతే.ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌లో మాస్కో సైన్యం దురాక్రమణకు దిగడంతో రష్యాపై అమెరికా, ఐరోపా దేశాలు భారీ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.అయితే పాశ్చాత్య దేశాల నుంచి విమర్శలు వస్తున్నప్పటికీ రష్యా నుంచి భారత్ చమురు దిగుమతులను పెంచింది.

మేలో.సౌదీ అరేబియాను అధిగమించి ఇరాక్ తర్వాత భారతదేశానికి రెండవ అతిపెద్ద చమురు సరఫరాదారుగా రష్యా అవతరించింది.

ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రిఫైనర్లు రష్యన్ క్రూడ్‌ను చాలా తక్కువ ధరకే అందుబాటులోకి తెచ్చారు.భారతీయ రిఫైనర్లు మేలో దాదాపు 25 మిలియన్ బ్యారెళ్ల రష్యా చమురును కొనుగోలు చేశారు.

ఇకపోతే.విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఈవారం రష్యా నుంచి చమురు దిగుమతిని సమర్ధించిన సంగతి తెలిసిందే.

దేవుడా.. ఏంటి భయ్యా ఈ కేటుగాళ్లు ఏకంగా ఫేక్ బ్యాంకునే పెట్టేసారుగా!
దేవరలో జాన్వీ నటనపై అనన్య రియాక్షన్ ఇదే.. అలా నటించడం సులువు కాదంటూ?

అసమంజసమైన అధిక చమురు ధరల మధ్య భారతదేశ ప్రజలకు ఉత్తమమైన ఒప్పందం లభించేలా చూడాల్సిన నైతిక బాధ్యత ప్రభుత్వానికి ఉందని జైశంకర్ అన్నారు.ఈ నేపథ్యంలో అమెరికా అత్యున్నత అధికారి ఒకరు భారత్‌కు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Advertisement

తాజా వార్తలు