Gollapalli Surya Rao : టీడీపీకి సీనియర్ నేత గొల్లపల్లి సూర్యారావు రాజీనామా..!

ఏపీలో టీడీపీకి షాక్ తగిలింది.

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు( Gollapalli Surya Rao ) పార్టీని వీడారు.

ఈ క్రమంలోనే పార్టీ పదవులతో పాటు, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.కాగా ఆయన టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, రాజోలు నియోజకవర్గ ఇంఛార్జిగా( Rajolu Constituency Incharge ) గొల్లపల్లి సూర్యారావు పని చేశారు.

టీడీపీ - జనసేన పొత్తులో( TDP Janasena Alliance ) భాగంగా రాజోలు నియోజకవర్గ టికెట్ ను జనసేనకు కేటాయించాలని నిర్ణయించారు.ఈ క్రమంలోనే తనకు టికెట్ రాదని భావించిన సూర్యారావు పార్టీని వీడారని తెలుస్తోంది.ఇక తాజాగా గొల్లపల్లి విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఎంపీ మిథున్ రెడ్డితో సమావేశమైన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఆయన వైసీపీ( YCP ) గూటికి చేరతారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

Advertisement
Breaking News : అగ్నికి ఆహుతైన టాటా ఏస్

తాజా వార్తలు