వ‌ర‌ద‌ల్లో చిక్కుకున్న త‌న పిల్ల‌ను కుక్క ఎలా కాపాడిందో చూడండి..

ఈ సృష్టిలో త‌ల్లి ప్రేమ‌ను మించింది ఇంకేదీ ఉండదేమో.ఈ ప్రేమ గురించి ఎన్ని సార్లు చెప్పినా ఎంత చెప్పినా త‌క్కువే.

ఎందుకంటే ఎలాంటి లాభం ఆశించ‌కుండా స్వ‌ఛ్చ‌మైన ప్రేమ‌ను పంచేది ఒక్క అమ్మ మాత్ర‌మే కావ‌చ్చు.త‌న బిడ్డ‌ల కోసం త‌ల్లి జీవితాన్ని ధార బోస్తుంది.

పిల్లలు ఎలా ఉన్నా స‌రే త‌ల్లి చూపించే అమితమైన ప్రేమను ఇంకెవ‌రూ చూపించ‌లేరేమో అనిపిస్తుంది.త‌న‌కు ఎన్ని క‌ష్టాలు ఉన్నా కూడా త‌న పిల్ల‌ల కోసం ఆమె ప‌డే త‌ప‌న అంతా ఇంతా కాదు.

ఇక పిల్ల‌కు ఏదైనా ఆప‌ద వ‌చ్చిందంటే త‌న ప్రాణం అడ్డేసి అయినా స‌రే కాపాడుకుంటుంది.ఇక త‌ల్లి ప్రేమ‌లో మ‌నుషులు మాత్ర‌మే కాదు జంతువులు కూడా ముందు వ‌రుస‌లోనే ఉంటాయి.

Advertisement

త‌మ పిల్ల‌ల‌కు ఎలాంటి ఆప‌ద వ‌చ్చినా ల‌దేంటే ఎండ, వాన, చలి ఇలా ఎలాంటి క్లిష్ట ప‌రిస్థితులు ఎదురైనా స‌రే త‌మ పిల్ల‌ల కోసం పడే కష్టం మాములుగా ఉండద‌నే చెప్పాలి.మనుషులు ఎలాగైనా త‌మ ప్రేమ‌ను పిల్ల‌ల మీద చూపిస్తారో అలాగే జంతువులు కూడా త‌మ స్వ‌చ్ఛ‌మైన ప్రేమ‌ను చూపిస్తుంటాయి.

ఇప్ప‌టికే ఇలా జంతువులు త‌మ త‌ల్లి ప్రేమ‌ను చూపించే వీడియోలు ఎన్నో వైర‌ల్ అయిపోయాయి.ఇక తాజాగా ఓ కుక్క త‌న పిల్ల‌ల కోసం ప‌డ్డ క‌ష్టం మ‌నం చూడొచ్చు.

ఇప్పుడు వైర‌ల్ అవుతున్న వీడియో చూస్తే విజయపురంలోని అలమెల ప్రాంతంలోని తారాపూర్ ఏరియాలో విప‌రీత‌మైన వ‌ర్షం కురుస్తోంది.కాగా ఈ భారీ వర్షాల‌కు అక్కడి గ‌ల్లీలు అన్నీ మునిగిపోయాయి.

ఇళ్లలోకి కూడా భార‌గా వర్షపు నీరు చేరి ఎటు చూసినా నీళ్లు క‌నిపిస్తున్నాయి.కాగా ఇలా వ‌ర‌ద నీటిలో చిక్కుకున్న కుక్క పిల్లలు అర‌వ‌డంతో వాటి త‌ల్లి వెంట‌నే వాటిని ఒక్కొక్క‌టిగా నోటితో పట్టుకుని వ‌ర‌ద నీటిలోనే ఇబ్బందులు ప‌డుతూ తీసుకెళ్తుంది.

అభిమన్యుడి మరణం శ్రీకృష్ణుడికి ముందే తెలుసా..?
వీడియో వైరల్ : శోభనం గదిలో ఆలియా, రణ్ వీర్.. ఇదే తొలిసారి అంటూ..

ఇలా వాటిని దూరంగా నీళ్లు లేని ప్లేస్లో పెడుతూ వాటికి ర‌క్ష‌ణగా ఏర్పాట్లు చేస్తుంది.అంత భయంకరమైన వరద నీటిలో త‌ల్లి ప్రేమ‌ను చూపించిన కుక్క‌ను నెటిజ‌న్లు కామెంట్ల‌తో ప్ర‌శంసిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు