బీజేపీ వైసీపీ పొత్తు ..? కానీ అంతా రహస్యం

కేంద్ర అధికార పార్టీ బీజేపీ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.ఏపీ తెలంగాణల్లో ఆ పార్టీకి పెద్దగా ఆదరణ లేకపోవడం.

ప్రజల ఆగ్రహం తీవ్రంగా ఉండడంతో ఎలాగు పెద్దగా ఓట్లు పడవని ముందుగానే ప్రాంతీయ పార్టీలతో రహస్య పొత్తులు పెట్టుకుంటోంది.బెదిరించో.

బుజ్జగించో .బయపెట్టో.ఏదో ఒకరకంగా తన దారికి తెచ్చుకుంటోంది.

ఇప్పటికే తెలంగాణాలో టీఆర్ఎస్ అధినేతతో ఈ విధమైన అవగాహనా వచ్చిందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఏపీలో ఆ పార్టీ వైసీపీతో అదే రకమైన ఒప్పందం చేసుకున్నట్టు తెలుస్తోంది.వసీపీ అధినేత జగన్ చుట్టూ ఎలాగూ కేసుల చట్రం ఉండడంతో బీజేపీ ప్లాన్ సులువుగా వర్కవుట్ అయ్యింది.

Advertisement

బీజేపీ తో ఒప్పందంలో భాగంగా .తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ అదే చేస్తున్నారు.బీజేపీకి కొన్ని సీట్లు కేటాయించి.

వాటిలో బలహీన అభ్యర్థుల్ని ప్రకటించేందుకు సిద్ధమయ్యారు.బీజేపీ సిట్టింగ్ సీట్లు ఇందులో ఉన్నాయి.

ఇదే ఫార్ములాను.జగన్ కి కూడా అన్వయించారు.

ఇప్పటికే వైసీపీతో సీట్ల చర్చలు పూర్తయ్యాయట.పదిహేను అసెంబ్లీ, ఆరు లోక్‌సభ సీట్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
నేటి ఎన్నికల ప్రచారం : బాబు అక్కడ .. జగన్ ఇక్కడ 

ఈ స్థానాలను గుర్తించారు కూడా.నేరుగా పొత్తు పెట్టుకుంటే మొదటికే మోసం వస్తుంది కాబట్టి లోపాయికారీ సహకారం ఇస్తామని బలహీన అభ్యర్థుల్ని పెడతానని.

Advertisement

అలాగే ఆర్థిక సాయం చేస్తానని జగన్ చెప్పారు.దానికి బీజేపీ నేతలు ఓకే అన్నట్టుగా విశ్వసనీయ సమాచారం .

వైసిపీ బీజేపీ ఒప్పందంలో భాగంగా .కన్నా లక్ష్మినారాయణకు గట్టి పోటీ లేకుండా చేసేందుకు అప్పిరెడ్డిని తప్పించి ఎవరికీ తెలియని ఏసురత్నాన్ని నిలబెట్టారు.అలాగే నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గంలోనూ ఇప్పటి వరకూ ఎవరికీ చెప్పడం లేదు.

ఇటీవల సమన్వయకర్తల మార్పు చేసిన నియోజకవర్గాలు కూడా బీజేపీ ఖాతాలోనికేనన్న ప్రచారం జరుగుతోంది.ముందు ముందు ఈ అంశంపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

జగన్‌ ఆకస్మికంగా ఇన్‌చార్జులను మార్చడంపై వైసీపీలో ఇబ్బంది కర పరిస్థితులు ఎదురవుతున్నాయి.అయితే జగన్ ఇంత అకస్మాత్తుగా చేస్తున్న మార్పుల వెనుక బీజేపీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉన్నట్టు అర్ధం అవుతోంది.

తాజా వార్తలు