ఏపీలో మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైఎస్ఆర్ సీపీ పార్టీలో( YSRCP ) కీలక మార్పులు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే పలు నియోజకవర్గాలకు సమన్వయకర్తలను మార్చిన పార్టీ అధిష్టానం తాజాగా ఇంచార్జుల రెండో జాబితాను విడుదల చేసింది.
సామాజిక సాధికారతే లక్ష్యంగా అన్ని కులాల వారికి ప్రాతినిధ్యం కల్పిస్తూ ఆ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్( CM Jagan ) తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.పార్టీ అవసరాల దృష్ట్యా కొంతమంది స్థానాలను మార్చుతూ పలు మార్పులు చేస్తున్నారు.
మార్పుల్లో భాగంగా రాజమండ్రి ఎంపీగా ఉన్న మార్గాని భరత్ ను( Margani Bharat ) రాజమండ్రి సిటీకి మార్చారు.మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణను రామచంద్రాపురం నియోజకవర్గం నుంచి రాజమండ్రి రూరల్ కు మార్పు చేశారు.
అలాగే మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావును( Vellampalli Srinivasa Rao ) విజయవాడ సెంట్రల్ కు మార్చిన పార్టీ హైకమాండ్ ఆయన స్థానంలో మైనార్టీకి చెందిన షేక్ ఆసిఫ్ కు అవకాశం ఇచ్చారు.
అదేవిధంగా యువతకు ప్రాధాన్యత కల్పించాలనే ఉద్దేశంతో మచిలీపట్నం నుంచి మాజీ మంత్రి పేర్ని నాని తనయుడు పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)కి,( Perni Krishnamurthy ) చంద్రగిరి నియోజకవర్గం నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, రామచంద్రాపురం నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్ తనయుడు పిల్లి సూర్యప్రకాశ్ కు( Pilli Surya Prakash ) అవకాశం కల్పించారు.పోలవరం నుండి తెల్లం బాలరాజు సతీమణి తెల్లం రాజ్యలక్ష్మీకి అవకాశం ఇచ్చిన పార్టీ అధిష్టానం తూర్పు గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇచ్చిన పిఠాపురం నుండి వంగా గీత, జగ్గంపేట నుంచి తోట నరసింహం, ప్రత్తిపాడు నుండి వరుపుల సుబ్బారావులకు అవకాశం కల్పించారు.
మైనార్టీలకు పెద్ద పీట వేసిన వైసీపీ అధిష్టానం విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుంచి షేక్ ఆసిఫ్,( Sheikh Asif ) గుంటూరు ఈస్ట్ నుండి షేక్ నూరి ఫాతిమా,( Shaik Noori Fathima ) కదిరి నుండి బీఎస్ మక్బూల్ అహ్మద్ లకు అవకాశం కల్పించారు.అన్ని వర్గాల వారికి సామాజిక న్యాయం చేస్తామని చెప్పిన సీఎం జగన్ మాటను నిలుపుకున్నారు.చెప్పిన మాట ప్రకారం ఎస్సీ, ఎస్టీ మరియు మైనార్టీలకు తగిన ప్రాధాన్యత ఇచ్చారు.
ఎస్సీ సామాజిక వర్గం నుంచి పాయకరావుపేట నుండి కంబాల జోగులు,( Kambala Jogulu ) పి.గన్నవరం నుంచి విప్పర్తి వేణుగోపాల్, ఎర్రగొండపాలెం నుంచి తాటిపర్తి చంద్రశేఖర్ కు ఛాన్స్ ఇచ్చిన సీఎం జగన్ ఎస్టీ సామాజిక నుంచి అరకు ఎంపీ స్థానానికి కొట్టగుళ్లి భాగ్యలక్ష్మీకి అవకాశం కల్పించారు.
ఇటీవల ప్రకటించిన తొలి జాబితాలో పదకొండు మందిని వైసీపీ అధిష్టానం మార్చిన సంగతి తెలిసిందే.తాజాగా రెండో జాబితాలో 27 మందిని నియోజకవర్గ ఇంఛార్జీలుగా నియమించారు.రెండు జాబితాలు కలిపి మొత్తం 38మందిని నియమించారు.
అలాగే వివిధ కారణాల వలన స్థానం కోల్పోయిన వారిని పార్టీ సేవలకు, నామినేటెడ్ పోస్టుల్లో నియమించి వారి సేవలను వినియోగించుకుంటామని స్పష్టం చేశారు.అన్ని సామాజిక వర్గాల వారికి న్యాయం చేకూర్చే విధంగా అభ్యర్థులను సీఎం జగన్ ఎంపిక చేశారు.
దీంతో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy