వైరల్: వామ్మో.. స్కూటీ డిక్కీ తెరవంగానే బుసకొట్టిన పాము.. దాంతో..?!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా పాములకు సంబంధించిన వీడియోలు ప్రత్యక్షమవుతున్నాయి.పాములు ఎక్కువగా చెట్లపై, అడవుల్లో ఉంటాయి.

అయితే మానవ మనుగడ వల్ల కొన్ని హానికరమైన పరిణామాలు మూగ జంతువులకు కలుగుతున్నాయి.గతంలో పాములను ఆడించేవాళ్లు ఇంటింటికి వెళ్లి బిక్షాటన చేసేవాళ్లు.

అయితే ఇప్పుడు వాళ్లు కనుమరుగయ్యారు.జంతు ప్రేమికులు, సంరక్షకులు అనేక పోరాటాలు చేయడం వల్ల జంతువులకు చాలా వరకూ హాని జరగడం లేదు.

ఇప్పుడున్న కాలుష్యం, రేడియేషన్ వల్ల చాలా వరకూ జంతువులు అనేవి నశించిపోతున్నాయి.పాముల్లో కూడా అనేక జాతులు కనుమరుగయ్యాయి.

Advertisement

వాతావరణ మార్పుల వల్ల పాములు ఇల్ల మీద పడుతున్నాయి.గతంలో కూడా ఇంటి ఫ్రిజ్ లో పాము ఉన్న ఘటన, టాయిలెట్ సింక్ లో పాము ఉన్న ఘటనలు చోటుచేసుకున్నాయి.

తాజాగా ఓ నాగుపాము స్కూటీ డిక్కీలో దర్శనమిచ్చిన ఘటన జరిగింది.పాము స్కూటీ డిక్కీలో కనిపించడంతో ఒక రైతు భయపడిపోయాడు.

వెంటనే ఆయన స్నేక్ సొసైటీ మెంబర్ కు ఫోన్ చేసి విషయం చెప్పాడు.వారు వచ్చి నాగుపామును పట్టుకున్నారు.

ఆ తర్వాత ఆ నాగుపామును ఒక సురక్షితమైన ప్రదేశానికి తీసుకెళ్లి వదిలారు.ఈ ఘటన తంగళ్లపల్లి మండలం రామన్నపల్లి గ్రామంలో జరిగింది.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
వైరల్ వీడియో : వాటే ఐడియా.. కరెంట్ లేకుండా ఐరన్ ఎంత సింపుల్ గా చేస్తున్నాడో కదా..

పోచయ్య అనే రైతు ఎప్పటిలాగే తన స్కూటీని తీసుకుని బయటకు వెళ్లాడు.

Advertisement

మధ్యలో తన స్కూటీ డిక్కీ తెరిచాడు.ఇంతలో అక్కడ నాగుపామును చూసి భయపడిపోయాడు.వెంటనే ఆయన ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ మెంబర్ అయిన వీరేందర్ కు కాల్ చేసి సమాచారమిచ్చాడు.

వీరేందర్ సంఘటనా స్థలానికి చేరుకుని నాగుపామును పట్టుకున్నాడు.ఆ తర్వాత ఆ పామును అడవిలో వదిలేశాడు.

ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.పాములు ఆహార నిమిత్తం, వాతావరణ మార్పుల వల్ల ఇల్ల మీద పడటంతో ఇటువంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని పలువురు అంటున్నారు.

తాజా వార్తలు