Boeing 727 crashed : కావాలనే పెద్ద విమానాన్ని కూల్చేసిన శాస్త్రవేత్తలు.. షాకింగ్ వీడియో వైరల్!

సాధారణంగా ఒక విమానం చాలా ఖరీదు ఉంటుంది.కాగా మెక్సికన్ శాస్త్రవేత్తలు ఒక పెద్ద విమానాన్ని ఉద్దేశపూర్వకంగానే కూల్చేశారు.ఒక ప్రయోగంలో భాగంగా దీనిని నేలకూల్చారు.2012లో మెక్సికన్ శాస్త్రవేత్తల బృందం బోయింగ్ 727ను క్రాష్ చేశారు.ఒక విమానం కూలిపోయినప్పుడు ఏ సీట్లలో కూర్చున్న ప్రయాణికులు ఎక్కువగా గాయపడతారు? ఎవరు చనిపోతారు? అనేది తెలుసుకోవడానికే ఈ క్రాష్ చేశారు.ఏప్రిల్ 27, 2012న, టెలివిజన్ స్టూడియోల బృందం మెక్సికాలి మెక్సికో సమీపంలో ఈ విమాన క్రాష్‌ను ప్రదర్శించింది.

 Scientists Shot Down A Big Plane Shocking Video Vira Boeing 727, Crash Experime-TeluguStop.com

ఈ విమానంలో కెమెరాలు, క్రాష్ టెస్ట్ డమ్మీలు, ఇతర సైంటిఫిక్ డివైజ్‌లు అమర్చారు. ఈ బోయింగ్ 727 అసలు యజమాని సింగపూర్ ఎయిర్‌లైన్స్.కాగా దీనిని చాలా డబ్బులు వెచ్చించి కొనుగోలు చేశారు.ఈ క్రాష్‌లో విమానంలోని చాలా పెద్ద విభాగాలు అయిన ఫ్యూజ్‌లేజ్‌, కాక్‌పిట్, ఫ్రంట్ విభాగం అంతగా డ్యామేజ్ కాలేదు.

ఈ పరీక్షలో శాస్త్రవేత్తలు ఏం కనిపెట్టారంటే.విమానం ముందు భాగంలో ఉన్న ప్రయాణికులు క్రాష్‌లో చనిపోయే ప్రమాదం చాలా అధికంగా ఉంది.

విమానం రెక్కలకు దగ్గరగా కూర్చున్న ప్రయాణీకులు కాలు విరగగొట్టుకునే ముప్పు ఉంది.కానీ వారైతే బతికి పోతారు.

ఇక టెయిల్ లేదా బ్యాక్ సెక్షన్ దగ్గర టెస్ట్ డమ్మీలు చాలా వరకు చెక్కుచెదరకుండా ఉన్నాయి.కాబట్టి అక్కడ ఉన్న ప్రయాణీకులెవరైనా తీవ్రమైన గాయం లేకుండా బతికి పోవచ్చు.అయితే ఈ విమానం ముందు భాగంపై కుప్పకూలింది కాబట్టి ముందు కూర్చున్న వారు మాత్రమే చనిపోయే అవకాశం ఉన్నట్లు తేలింది.అదే వెనుక భాగంపై పూర్తిగా కూలిపోయి ఉంటే వెనుక వారు చనిపోయే అవకాశం ఎక్కువ.

ఈ వీడియో పై మీరు కూడా ఓ లుక్కేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube