పాములు కుబుసం విడుస్తుంటాయి.అది చాలా మంది చూసే ఉంటారు.
వినే ఉంటారు.అయితే, లక్షల సంవత్సరాల కిందట భూమిపై జీవించిన డైనోసార్లు, ఆ కాలం నాటి పక్షులు కూడా చర్మాన్ని విడిచేవని శాస్త్రవేత్తలు తమ అధ్యయనం ద్వారా చెబుతున్నారు.
డైనోసార్ల శిలాజాలపై పెచ్చులుగా ఉన్న పదార్ధాన్ని పరిశీలించడంతో ఈ విషయం తెలిసిందని వారు తెలిపారు.ఈ పదార్థం చుండ్రేనని తమ పరిశోధనల్లో తేలిందని వారు పేర్కొన్నారు.

యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కార్క్‌కు చెందిన ప్రొఫెసర్ మెక్ నరమా మరికొందరు 2012లో చైనాకు వెళ్లి అక్కడి డైనోసార్ల శిలాజాలను అధ్యయనం చేశారు.”రెక్కలున్న డైనోసార్ శిలాజాలాలపై రసాయనికంగా, ఎలక్ర్టానిక్ మైక్రోస్కోప్ కింద పరీక్షలు నిర్వహించారు.అలా డైనోసార్ల శిలాజాలాలపై పరిశోధనలు చేయడం అదే మొదటిసారి.వీటి ఫలితాలు శాస్త్రీయ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేశాయి” అని మెక్ అనే శాస్త్రవేత్త అప్పట్లోనే పేర్కొన్నారు.

పాములు, సరీసృపాల మాదిరిగా కాకుండా డైనోసార్లు చిన్న చిన్న భాగాలుగా తమ ఈకల నుంచి చర్మాన్ని వదిలేసేవని వీరి బృందం తెలిపింది.అంతేకాదు, డైనోసార్ల కాలం నాటి పక్షులు ఎగరడంలో అంత నైపుణ్యాన్ని ప్రదర్శించేవికావని తమ అధ్యయనంలో తేలిందని మెక్ పేర్కొన్నారు.”అసలు వారు అప్పటి పక్షుల ఈకలపై అధ్యయనం చేయాలనుకున్నారట కానీ.ఈకలను పరిశీలించగా వాటిపై తెల్ల మచ్చలుండటం గమనించారట.
ఆ మచ్చలు ఈకల చుట్టూ ఉన్నాయి” అని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్ మరియా మెక్ నమరా తెలిపారు.

అయితే వారు వాటిని శిలాజాల జీవ లక్షణమని అనుకున్నారట.కానీ, అది చివరకు చుండ్రు అని తేలడంతో ఆశ్చర్యపోయారని’ అని వివరించారు.ఈకలు ఉండటం వల్లే వాటికి చుండ్రు వచ్చిఉంటుందని తాము నమ్ముతున్నామన్నారు.”శిలాజాలపై పెచ్చులుగా అది కనిపించింది.దాన్ని పరిశోధించగా మరో ఆసక్తికర విషయం కూడా తెలిసింది.
డైనోసార్లు చర్మాన్ని ఏ విధంగా వదిలేస్తున్నాయో కూడా దీని వల్లే అర్థమైంది” అని ఆయన వివరించారు.

గతంలో అమెరికాలోని టెక్సస్ ప్రాంతంలో నెలకొన్న తీవ్ర కరవు మూలంగా ఓ అద్భుతం బయటపడింది.అక్కడ 11.3 కోట్ల ఏళ్ల నాటి డైనోసార్ల పాదముద్రల్ని గుర్తించారు.దాదాపు పూర్తిగా ఎండిపోయిన ఒక నది ఒడ్డున వీటిని నిపుణులు కనుగొన్నారు.భారీగా ఉన్న ఈ అడుగుల గుర్తులు డైనోసార్ల పాదముద్రల్లా ఉన్నాయి.నది ఒడ్డున అనేక పొరలుగా పేరుకుపోయిన బురద అడుగు భాగంలో ఇవి కనిపించాయి.సెంట్రల్ టెక్సస్‌లోని డైనోసర్ వ్యాలీ స్టేట్ పార్క్‌లో వీటిని కనుగొన్నట్లు సూపరింటెండెంట్ జెఫ్ డేవిస్ చెప్పారు.
కోట్ల సంవత్సరాలుగా చెక్కుచెదరకుండా ఉన్నాయని అన్నారు.అమెరికా కరవు పర్యవేక్షణ సంస్థ ప్రకారం, టెక్సస్ రాష్ట్రం సుదీర్ఘ కాలంగా అనావృష్టి, కరవును ఎదుర్కొంటోంది.
కరవును మూడు అత్యంత తీవ్రమైన కేటగిరీలుగా విభజించగా టెక్సస్‌లోని 87 శాతం భూభాగం గత వారం ఈ కేటగిరీల్లో ఒకటిగా నిలిచింది.అక్కడ కొన్ని చోట్ల అతి తీవ్ర, తీవ్ర, అసాధారణ కరవు పరిస్థితులు ఉన్నాయి.

భగభగమండే వేసవి, విపరీతమైన పొడి వాతావరణ పరిస్థితుల కారణంగా స్టేట్ పార్క్ గుండా ప్రవహించే ఒక నది పూర్తిగా ఎండిపోయింది.దీంతో డైనోసార్ల పాదముద్రలు బయటపడ్డాయి.అక్కడ కనుగొన్న పాదముద్రలు, అక్రోకాంతోసారస్ అనే డైనోసార్ల జాతికి చెందినవని బీబీసీతో డేవిస్ చెప్పారు.అక్కడ మొత్తం 140 పాదముద్రలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.వాటిలో 60 పాదముద్రలు 30 మీటర్ల దూరంలో విస్తరించి ఉన్నాయి.