పాఠశాలలో ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలి: అదనపు కలెక్టర్ గంగాధర్

యాదాద్రి భువనగిరి జిల్లా: పాఠశాలలో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించడంతో పాటు విద్యార్దులకు నాణ్యమైన విద్యను అందించాలని యాదాద్రి భువనగిరి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గంగాధర్ అన్నారు.

శుక్రవారం మోటకొండూర్ లోని మహాత్మా జ్యోతిభా పూలే బి.

సి రెసిడెన్షియల్ స్కూల్ ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.విద్యార్థులకు అందిస్తున్న భోజన వసతి సదుపాయాలు,విద్యా బోధన,మెనూ తదితర విషయాలను పాఠశాల ప్రిన్సిపాల్ ను అడిగి తెలుసుకున్నారు.

తరగతి గదికి వెళ్లి విద్యార్థులతో మాట్లాడుతూ చదువు తీరును పర్యవేక్షించారు.అనంతరం విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని, వంటగదిని,డైనింగ్ హాల్,ప్రభుత్వం అందించిన పాఠ్యపుస్తకాలు,నోట్ బుక్స్,స్టోర్ రూమ్ లో ఉంచిన సరుకుల నాణ్యతను,అత్యవసర వస్తువుల స్టాక్ రిజిస్టర్ తదితరాలను పరిశీలించారు.

మౌలిక వసతుల కల్పనలో సముచిత స్థాయి కలిగి ఉండాలని,త్రాగునీరు పారిశుద్ధ్య పనులు వంటి మౌలిక వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు.గత సంవత్సరంలో విద్యార్థులు మెరుగైన ఉత్తీర్ణత శాతం పొందినందుకు అభినందించారు.

Advertisement

ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అధికారి యాదయ్య, కళాశాల ప్రిన్సిపల్ జ్యోతి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

1366 రోజులుగా అన్నార్తుల సేవలో మీ మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్
Advertisement

Latest Yadadri Bhuvanagiri News